
Passport-Citizenship Row: కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సంచలన నిర్ణయాన్ని వెలువరించింది. పాస్ పోర్టు అనేది భారత పౌరసత్వం కిందకు రాదని, అది కేవలం ప్రయాణానికి ఉపయోగపడే ఒక సాధనంగా పేర్కొంది. అంటే మీకు ఇండియన్ పాస్ పోర్టుని మీ సిటిజన్ షిప్ కింద చూపించలేరన్నమాట. కేంద్రం తీసుకునే కొన్ని కొన్ని నిర్ణయాల వల్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం అవుతోంది. కొన్ని కొన్ని సార్లు జనం ఇలాంటి ప్రకటనలను తలతిక్క నిర్ణయాలుగా కూడా అభివర్ణించే అవకాశాలు ఉంటాయి. మీకు గనక పాస్ పోర్టు ఉంటే దాని వెనుక చూస్తే ఒకటి రాసి ఉంటుంది. ‘ఈ పాస్ పోర్టు భారత ప్రభుత్వానికి సంబంధించినది. మీరు వేరే దేశం సిటిజన్ షిప్ తీసుకుంటే దీన్ని సరెండర్ చేయాలి’ అని రాసి ఉంటుంది. 1955 ఇండియన్ సిటిజన్ షిప్ చట్టం ప్రకారం భారతదేశం రెండు పౌరసత్వాలను అంగీకరించదు. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛందంగా వేరే దేశం పౌరసత్వం తీసుకుంటే.. 1967 పాస్ పోర్ట్ యాక్ట్ ప్రకారం ఆ పాస్ పోర్టును అప్పగించాలి. లేకపోతే నేరం అవుతుంది. అసలు పాస్ పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాకపోతే వేరేదేశం సిటిజన్ షిప్ తీసుకున్నప్పుడు దీన్ని వెనక్కి ఇచ్చేయాల్సిన అవసరం ఏముంది?. వేరే దేశం పౌరసత్వం తీసుకుని పాస్ పోర్టు అప్పగించని వాళ్ల మీద ఫైన్లు, కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? మన దగ్గర ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు.. ఇలా రకరకాల కార్డులు తీసుకుంటాం. కానీ ఏ కార్డుకి కూడా పోలీస్ వెరిఫికేషన్ చేయరు. పాస్ పోర్టుకి మాత్రమే పోలీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఇది అసలు పౌరసత్వానికి రుజువే కాకపోతే అసలు ఇంత తతంగం ఎందుకు? పాస్ పోర్టు ఆఫీసు ముందు తెల్లవారుజాము నుంచి లైన్లలో నుంచోవడం ఎందుకు? వాళ్లకు ఫీజులు ఎందుకు? అసలు ఇవన్నీ కాదు. భారతీయులకు కాకుండా వేరే దేశస్తులకు కూడా ట్రావెల్