పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
Actor ProfileActor

పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్
NTV Telugu20 Jun 2026
పుష్ప 2 తర్వాత 20 తెలుగు పాన్ ఇండియా ఫెయిల్యూర్స్

పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనకపడిపోయింది. సినిమా మొదలైనప్పుడే హిందీతో పాటు సౌత్ లోని అన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తామని ప్రకటిస్తున్నారు. పాన్ ఇండియా మూవీస్ వరుసగా ఫెయిల్యూర్ కావడంతో, తెలుగు సినిమా ఇండస్ట్రీ వరుస ఫెయిల్యూర్స్ చూడాల్సి వస్తుందా? పుష్ప 2 తర్వాత ఓ 20 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు. బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అయ్యాయి. పుష్ప, కార్తికేయ 2, కాంతార హిట్ కావడంతో పాన్ ఇండియా జోరు పెరిగింది. పుష్ప 2 అయితే ఏకంగా హిందీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే జోరుతో రిలీజ్ అయిన తెలుగు పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ దగ్గర చతికిలపడ్డాయి. RRRతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనిపించుకున్నారు. అయితే, ఆ తర్వాత వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ ను బాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకోలేదు. ‘పెద్ది’ హిందీ వసూళ్లను కొల్లగొడుతుందని నిర్మాతలు ఎక్స్పెక్ట్ చేశారు, టీం నార్త్ కు మూడు సార్లు వెళ్లి మరీ ప్రచారం చేసినా బాలీవుడ్ ఆడియన్స్ కు కాన్సెప్ట్ నచ్చక రిజెక్ట్ చేశారు. బాలీవుడ్ హిట్ ‘చందు ఛాంపియన్’ కథతో ‘పెద్ది’ పోలి ఉండడంతో హిందీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించలేదు. ‘దసరా’ నుంచి నాని తన ప్రతి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నా, తెలుగు ఆడియన్స్ తప్ప అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలన్న కల మాత్రం తీరడం లేదు. మరి ‘పారడైజ్’ తోనైనా నాని డ్రీమ్ తీరుతుందో లేదో చూడాలి మరి. పాన్ ఇండియా హిట్ కొట్టడం అంటే చాలా కష్టం. బాహుబలి, పుష్ప, పుష్ప 2, హనుమాన్, కార్తికేయ 2, దేవర.. అంటే ఏడు ఎనిమిది సినిమాలే ఆ రేర్ ఫీట్ సాధించాయి. అన్ని లాంగ్వేజ్ ఆడియన్స్ కు నచ్చే కథ రెడీ చేయడం పైనే