పెళ్లయిన నెలకే.. ఆలయ గుట్ట
Actor ProfilePolitician

పెళ్లయిన నెలకే.. ఆలయ గుట్ట

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లయిన నెలకే.. ఆలయ గుట్టపై నుంచి పడి యువతి మృతి
Eenadu31 Jul 2026
పెళ్లయిన నెలకే.. ఆలయ గుట్టపై నుంచి పడి యువతి మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెళ్లయిన నెలకే ఆలయ గుట్టపై నుంచి పడి యువతి మృతి చెందిన ఘటన తమిళనాడు (Tamil Nadu)లోని తూత్తుకుడి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌత్ తిట్టంకులం ప్రాంతానికి చెందిన అనిత (24)కు.. గత నెలలో సురేశ్‌ అనే వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లి అనంతరం ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన భర్త ఇటీవల ఇంటికి తిరిగి వచ్చారు. శనివారం తెల్లవారుజామున దంపతులు కజుగుమలైలోని ఓ ఆలయానికి వెళ్లారు. పూజ అనంతరం కొండపై ఉన్న కోతులకు అనిత అరటి పండ్లు పెడుతుండగా.. ఆ గుంపు ఒక్కసారిగా ఆమెను చుట్టుముట్టింది. భయాందోళనకు గురైన యువతి అక్కడి నుంచి పరుగెత్తుతుండగా.. ప్రమాదవశాత్తు కొండపై నుంచి కిందపడింది. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మరణించింది. కట్టుకున్న భార్య కళ్లెదుటే ప్రాణాలు కోల్పోవడంతో ఆమె భర్త షాక్‌కు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఇదీ చదవండి: డ్రగ్స్ కాదు.. అది మెడిసిన్‌: వివాదంలో తమిళనాడు మంత్రి గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు