పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
Actor ProfileActor

పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

Total News1
Movie Updates0
Sources1
పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్
Sakshi14 Jun 2026
పెళ్లి రద్దు! తొలిసారి స్పందించిన టాలీవుడ్ హీరోయిన్

కొందరు హీరోయిన్లు వయసులోనే పెళ్లి చేసుకుంటే.. మరికొందరు మాత్రం కాస్త ఏజ్ బార్ అయిపోయిన తర్వాత వైవాహిక బంధంలోకి అడుగుపెడుతుంటారు. రీసెంట్ టైంలో చూసుకుంటే రష్మిక, కీర్తి సురేశ్ తదితరులు కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే తాము ప్రేమించిన వాళ్లతో కొత్త జీవితాలు ప్రారంభించేశారు. అయితే టాలీవుడ్ హీరోయిన్ నివేదా పేతురాజ్ మాత్రం గతంలో ప్రియుడిని పరిచయం చేసింది. పెళ్లికీ సిద్ధమైంది. ఏమైందో ఏమో గానీ అన్నింటినీ రద్దు చేసుకుంది. ఇప్పుడు 'సింగ్ గీతం' మూవీతో నటిగా రీఎంట్రీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు థ్రిల్లర్ సినిమా) ఈ చిత్ర సక్సెస్ మీట్ ఆదివారం జరగ్గా.. ఇందులోనే తన కెరీర్ గురించి మాట్లాడిన నివేదా పేతురాజ్ పరోక్షంగా తన ప్రేమ, ప్రియుడు, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 2023లో నేను సినిమాలు మానేయాలి అని నిర్ణయించుకున్నాను. తర్వాత కొన్ని రాంగ్ డెసిషన్స్ లాంటివి తీసుకున్నా. ఫైనల్‌గా 'సింగ్ గీతం'తో రీ ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా అనిపించింది అని నివేదా చెప్పుకొచ్చింది. నివేదా చెప్పిన వాటిలో రాంగ్ డెసిషన్స్ అనేవి ప్రియుడు, పెళ్లి గురించే అనిపిస్తోంది. దుబాయికి చెందిన రజిత్ ఇబ్రాన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో ప్రేమలో ఉ‍న్నట్లు ఈ హీరోయిన్.. 2023లో వెల్లడించింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. కాకపోతే దీని గురించి ఎక్కడ మాట్లాడని నివేదా.. ఇన్ స్టాలో ఫొటోలని డిలీట్ చేసింది. 'సింగ్ గీతం'తో రీఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వెంకటేశ్-త్రివిక్రమ్ 'ఆదర్శ కుటుంబం', చిరంజీవి-బాబీ మూవీలోనూ కీలక పాత్రలు చేస్తోంది. (ఇదీ చదవండి: పెళ్లిరోజు స్పెషల్.. సర్‌ప్రైజ్ ఇచ్చిన ఉపాసన) సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు) యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్‌ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The