పెళ్లి కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకుంది.. ఆకాష్ దీప్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు
Actor ProfilePolitician

పెళ్లి కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకుంది.. ఆకాష్ దీప్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెళ్లి కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకుంది.. ఆకాష్ దీప్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు
TV9 Telugu17 Jul 2026
పెళ్లి కోసం ఉద్యోగాన్ని కూడా వదులుకుంది.. ఆకాష్ దీప్ చేసుకోబోయే అమ్మాయి ఎవరు

Akash Deep : భారత క్రికెట్ జట్టులో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ ఓ ఇంటి వాడయ్యాడు. బీహార్‌కు చెందిన ఈ స్టార్ పేసర్ త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టేశాడు. మణికపూర్‌కు చెందిన అక్షిత రాజ్‌తో ఆయన వివాహం జరిగింది. ఈ వేడుకకు పవిత్ర కాశీ పుణ్యక్షేత్రం వేదిక అయింది. వారణాసిలోని లగ్జరీ హోటల్ తాజ్ గంగెస్‎లో వీరిద్దరి వివాహం హిందూ సాంప్రదాయబద్ధంగా ఎంతో ఘనంగా జరిగింది. ఆకాష్ దీప్ బీహార్‌లోని రోహతాస్ జిల్లా బడ్డి గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, ఆయన భార్య కాబోతున్న అక్షిత రాజ్ కూడా అదే జిల్లాలోని మణికపూర్ నివాసి. ఆమె తండ్రి పేరు అమిత్ కుమార్ సింగ్. అక్షిత ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన అమ్మాయి. వీరిద్దరిదీ పూర్తిగా పెద్దలు కుదిర్చిన అరేంజ్డ్ మ్యారేజ్ కావడం విశేషం. చదువులో ఎంతో ప్రతిభావంతురాలైన అక్షిత రాజ్.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థ అయిన బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (BIT) నుంచి బీసీఏ, ఎంసీఏ డిగ్రీలను పూర్తి చేసింది. పెళ్లి కోసం సాఫ్ట్‌వేర్ జాబ్‌ను వదులుకుంది ఉన్నత చదువులు పూర్తి చేసిన అక్షిత రాజ్‌కు చదువు పూర్తి కాగానే ఒక ప్రముఖ ఐటీ కంపెనీ నుంచి భారీ ప్యాకేజీతో కూడిన మంచి సాఫ్ట్‌వేర్ ఉద్యోగ ఆఫర్ వచ్చింది. అయితే, అదే సమయంలో ఆకాష్ దీప్‌తో పెళ్లి సంబంధం మాట్లాడటం, పెళ్లి ఖాయం కావడం జరిగాయి. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న తరుణంలో కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యత ఇవ్వాలని భావించిన అక్షిత.. వచ్చిన ఉద్యోగ అవకాశాన్ని సంతోషంగా వదులుకుంది. కాబోయే భర్త క్రికెట్ కెరీర్‌కు అండగా నిలిచేందుకే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆకాష్ దీప్ ప్రతిభను గుర్తించిన బీహార్ ప్రభుత్వం కొన్ని రోజుల క్రితమే ఆయనకు గౌరవప్రదమైన డీఎస్పీ పదవిని ఇచ్చి గౌరవించింది. అటు డీఎస్పీ ఉద్యోగం, ఇటు పెళ్లి ఘడియలు