ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసింది.. డైరెక్టర్ ఆర్జీవీ
Actor ProfileActor

ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసింది.. డైరెక్టర్ ఆర్జీవీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసింది.. డైరెక్టర్ ఆర్జీవీ
TV9 Telugu1 Sept 2026
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు బాక్సాఫీస్ షేక్ చేసింది.. డైరెక్టర్ ఆర్జీవీ

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన జీవితంపై, సినీ ప్రస్థానంపై ఆసక్తికరమైన విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను తన జీవితంలో ఎప్పుడూ ఏ విషయం గురించి పశ్చాత్తాపపడలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రతి అనుభవం ఒక వ్యక్తిని తీర్చిదిద్దడంలో దోహదపడుతుందని, అది తన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరిచిందని ఆయన వివరించారు. తాను చేసిన పనులను ఇతరులు లేదా తానూ తప్పుగా భావించినా, చివరికి అవి తనకు ఏదో ఒక విధంగా మేలు చేశాయని ఆర్జీవీ పేర్కొన్నారు. తన కెరీర్‌లో అత్యంత చెత్త సినిమా ఏదని ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా, వర్మ అంతం అని సమాధానమిచ్చారు. ఒక జేమ్స్ హాడ్లీ ఛేజ్ నవల ఆధారంగా తీసిన ఈ సినిమాను, ఉన్న మెటీరియల్‌ను తాను సరిగ్గా ఉపయోగించుకోలేక చెడగొట్టానని అన్నారు. అయితే ఈ అంతం సినిమానే తన బాలీవుడ్ స్టాండింగ్‌కు మూల కారణమని ఆర్జీవీ వెల్లడించారు. ఈ సినిమా ద్వారానే నటి ఊర్మిళ పరిచయం కావడం, తదనంతరం రంగీలా వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా, అంతం ఆడలేదనే కారణంతో, అదే కథాంశాన్ని విభిన్నంగా మలచి సత్య సినిమాను తెరకెక్కించానని వివరించారు. ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్.. ఈ రెండు చిత్రాలు తన కెరీర్‌లో అత్యంత కీలకమైనవని, అవి అంతం మూలంగానే వచ్చాయని ఆర్జీవీ పేర్కొన్నారు. జనాల దృష్టిలో అంతం ఒక ఫ్లాప్ కావచ్చు, కానీ తన విషయంలో అది తన సినీ ప్రస్థానానికి ప్రధాన కారణమని ఆయన చెప్పారు. జీవితంలో క్లైమాక్స్ అనేది మరణం వరకు రాదని, కానీ సినిమాల ద్వారా ఏర్పడిన సంబంధాలు, అనుభవాలు జీవితాంతం కొనసాగుతాయని, అవి తనకు కంటిన్యూయింగ్ అసెట్స్ అని ఆయన అన్నారు. తన తాజా ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ, జగన్ గారిపై తీస్తున్న సినిమా