టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. సొంతూరికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట డివిజన్ లోని 45 ప్రభుత్వ పాఠశాలల్లో 180 మంది మెరిట్ స్టూడెంట్స్ కు స్కాలర్ షిప్స్ అందజేశారు. 9, 10వ తరగతిలో ప్రతిభ కనబర్చి ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థులకు 'ది దేవరకొండ ఫౌండేషన్' ఆధ్వర్యంలో ఉపకార వేతనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో విజయ్ సతీమణి రష్మిక, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ''ఈరోజు ఊరు చాలా అందంగా ఉంది. ఫస్ట్, సెకండ్ ర్యాంక్స్ సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు కంగ్రాట్స్. మీ విజయాన్ని, దాని వెనకున్న క్రమశిక్షణను సెలబ్రేట్ చేయడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం. మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడం కంటే, ఆ మార్కులు సాధించేందుకు పడిన శ్రమ, ఏకాగ్రత చాలా గొప్పవి. మీరు ఫోకస్ గా, డిసిప్లిన్ గా ఉండి ప్రయత్నించడం వల్లే ర్యాంకులు సాధించగలిగారు. ఒక్కోసారి మార్కులు తక్కువ రావొచ్చు, ఎక్కువ రావొచ్చు కానీ.. జీవితంలో ఫోకస్, క్రమశిక్షణ చాలా ముఖ్యం. అవి ఉంటే ఏ రంగంలో అయినా గొప్ప స్థాయికి వెళ్లొచ్చు'' అని అన్నారు.''స్టూడెంట్ లైఫ్ లో నేనెప్పుడూ ఫస్ట్ ర్యాంకర్ కాదు, రష్మిక అసలే కాదు. మీ విజయాన్ని సెలబ్రేట్ చేయడానికి మేమంతా ఇక్కడికి వచ్చాం. ఈసారి రిజల్ట్స్ లో తెలంగాణలో నాగర్ కర్నూల్ జిల్లా సెకండ్ ప్లేస్ లో నిలిచినందుకు హ్యాపీగా ఉంది. నాగర్ కర్నూలు టీచర్స్ అందరికీ ఈ క్రెడిట్ దక్కుతుంది. పిల్లల జీవితాల్లో టీచర్స్, తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. పేరెంట్స్ ఎలా ప్రవర్తిస్తే పిల్లలు అలా నేర్చుకుంటారు. మీరు గొప్ప వ్యాల్యూస్ నేర్పిస్తే వాళ్లు గొప్పగా ఎదుగుతారు. నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నానంటే పుట్టపర్తి స్కూల్లోని మంచి వాతావరణం. మా ఇంట్లో పేరెంట్స్ నేర్పించిన మంచి నడవడికే కారణం. మా నాన్న
Actor ProfileActor
ప్లీజ్.. ఇక్కడేమీ కల్తీ చేయకండి.. నా గుండె బద్దలవుతుంది’.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•14 Jun 2026
ప్లీజ్.. ఇక్కడేమీ కల్తీ చేయకండి.. నా గుండె బద్దలవుతుంది’.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్