పిలిచారా? పిలిచినా రానని చెప్పిందా?
Actor ProfileActor

పిలిచారా? పిలిచినా రానని చెప్పిందా?

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పిలిచారా? పిలిచినా రానని చెప్పిందా? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్
Telugu Cinema13 Jul 2026
పిలిచారా? పిలిచినా రానని చెప్పిందా? - తెలుగు సినిమా న్యూస్, రివ్యూస్

“పెద్ది” (Peddi) సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటించింది. కానీ ఆ సినిమా విడుదలైన తర్వాత ఆమె సైలెంట్ అయిపొయింది. సినిమాలో తన పాత్ర చిత్రణ విషయంలో ఆమె ఫీల్ అయింది. దాంతో దర్శకుడు బుచ్చిబాబు సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాత సారీ చెప్పాడు. అయినా ఆమె చలించలేదు. సినిమా విడుదల తర్వాత జాన్వీ కపూర్ ఎక్కడా దీని గురించి మాట్లాడలేదు. తన ఇన్ స్టాగ్రామ్ లో కూడా పోస్ట్ పెట్టలేదు. ఐతే తాజాగా అంటే నిన్న రాత్రి హైదరాబాద్ లో ఈ సినిమావిజయోత్సవ సంబరాలు జరిగాయి. రామ్ చరణ్ తో పాటు సుకుమార్, బుచ్చిబాబు, చిరంజీవి అంతా విచ్చేశారు. కానీ జాన్వీ కపూర్ డుమ్మా కొట్టింది. ఇంతకీ ఆమెని ఈ ఈవెంట్ కి రమ్మని పిలిచారా అన్నది కూడా సందేహమే. పిలిచినా ఆమె వచ్చేదా అనేది కూడా డౌట్. ఈ సినిమాలో ఆమె అచ్చియమ్మ అనే పాత్ర పోషించింది. ఈ పాత్ర విషయంలో జాన్వీ కపూర్ కన్నా దర్శకుడు బుచ్చిబాబు ఎక్కువ ట్రోలింగ్ పొందాడు. రిలీజ్ కి ముందు ఈ అమ్మడు ఈ సినిమాపై ఎక్కువ ఆశలు పెట్టుకుని తెగ ప్రమోట్ చేసింది. కానీ రిలీజ్ అయిన తర్వాత ఆమెకి సీన్ అర్థమై ఈ టీంకి దూరం జరిగింది. ఆమెకి ఈ సినిమాకి ఏకంగా 8 కోట్ల పారితోషికం ఇచ్చారట