
నిరుటితో పోలిస్తే నాలుగో వంతుకూ చేరని పంటల సాగు విస్తీర్ణం ఇప్పటివరకు 10 వేల ఎకరాల్లో మాత్రమే వరి, 5.43 లక్షల ఎకరాల్లో మాత్రమే పత్తి మొత్తంగా ఇప్పటివరకు 6.5 లక్షల ఎకరాల్లోనే పంటలు సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్ సీజన్‌లో పల్లెల్లో తెల్లవారుజామునే వినిపించే ట్రాక్టర్ల శబ్దాలు ఇప్పుడు అంతగా లేవు. నాగళ్లు భుజాన వేసుకుని వెళ్లే రైతులూ లేరు. నాగలి సాళ్లు పడాల్సిన పొలాల్లో అనేకచోట్ల ఇంకా పిచ్చి మొక్కలే కనిపిస్తున్నాయి. జూన్ మూడో వారం ముగుస్తున్నా చాలాచోట్ల భూములింకా బీడుపడే కనిపిస్తున్నాయి. రైతులు ఆకాశం వైపు ఆశగా చూస్తున్నారు. వాన రాకకోసం నిరీక్షిస్తున్నారు. ముఖ్యంగా తొలకరి జల్లులతో పత్తి విత్తనాలు వేసిన వారు మొలకలు రాక దిగాలుగా దిక్కులు చూస్తున్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ఆలస్యం కావడం, అక్కడక్కడా అడపాదడపా కురిసిన చిరు జల్లులు కూడా నిలకడగా లేకపోవడంతో రాష్ట్రంలో వ్యవసాయ కార్యకలాపాలు దాదాపు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో 132 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేయగా, ఇప్పటివరకు కేవలం 7.5 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగయ్యాయి. గత ఏడాది ఇదే సమయానికి 26 లక్షల ఎకరాల్లో పంటలు వేశారంటే..ప్రస్తుతం సాగులో ఎంత జాగు చోటు చేసుకుందో అర్థమవుతుంది. రాష్ట్రంలో ఖరీఫ్ ప్రధాన పంటగా మారిన వరి సాగు ఈసారి దాదాపు నిలిచిపోయినట్లే కనిపిస్తోంది. జూన్ మూడో వారం వరకు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 10 వేల ఎకరాల్లో మాత్రమే వరి నాట్లు లేదా విత్తనాలు వేయగలిగారు. గత ఏడాది ఇదే సమయానికి సుమారు 59 వేల ఎకరాల్లో వరి సాగు ప్రారంభం కావడం గమనార్హం. వరి నాట్లు వాయిదా సాధారణంగా జూన్ రెండో వారం నుంచే నారుమళ్లు సిద్ధమై, అనేక ప్రాంతాల్లో నాట్లు కూడా మొదలవుతాయి. కానీ ఈసారి వర్షాలు లేకపోవడం, చెరువులు, కుంటలు, బోర్లు కూడా ఆశించిన స్థాయిలో నిండకపోవడంతో రైతులు నాట్ల