ప్రశ్న రావణ్ కు పిఠాపురం కోర్టు రిలీఫ్
Actor ProfilePolitician

ప్రశ్న రావణ్ కు పిఠాపురం కోర్టు రిలీఫ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రశ్న రావణ్ కు పిఠాపురం కోర్టు రిలీఫ్- అంతలోనే మరో ట్విస్ట్
Oneindia Telugu1 Sept 2026
ప్రశ్న రావణ్ కు పిఠాపురం కోర్టు రిలీఫ్- అంతలోనే మరో ట్విస్ట్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పిఠాపురం పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసిన యూట్యూబర్ ప్రశ్న రావణ్ (Prasna ravan) బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. పిఠాపురం కోర్టు రావణ్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. పోలీసులు నమోదు చేసిన కేసుపై రిమాండ్ కు నిరాకరించిన కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఊరట లభించిందని భావిస్తున్న తరుణంలో మరో ట్విస్ట్ ఎదురైంది.నాలుక కోస్తామన్నా స్పందించరా?- చంద్రబాబు సర్కార్ పై రఘురామ ఫైర్..!సోషల్ మీడియాలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన సోషల్ మీడియా కార్యకర్త ప్రశ్న రావన్‌కు పిఠాపురంలోని స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. వెంటనే కాకినాడ జిల్లాలోని సర్పవరం పోలీస్ స్టేషన్‌లో గతంలో నమోదైన మరో కేసులో పోలీసులు అతన్ని తిరిగి అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని పిఠాపురం టౌన్ సీఐ ఏఎన్ఐ వార్తాసంస్ధకు వెల్లడించారు. త్వరలో ఏపీ కేబినెట్ ప్రక్షాళన-హోంమంత్రిగా పవన్-రఘురామ షాకింగ్..!పవన్ కళ్యాణ్ పై తన యూట్యూబ్ ఛానల్ ప్రశ్న ద్వారా టార్గెట్ చేస్తున్నారనే ఆరోపణలు రావణ్ పై ఎప్పటి నుంచో ఉన్నాయి. గతంలోనూ పలుమార్లు రావణ్ చేసిన విశ్లేషణలపై జనసేన అభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో ఆయనపై రెచ్చిపోయారు. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో మాత్రం హైదరాబాద్ వెళ్లి మరీ పిఠాపురం పోలీసులు రావణ్ ను అరెస్టు చేశారు. అక్కడి నుంచి పిఠాపురం కోర్టులో తీసుకొచ్చి హాజరుపర్చారు. రిమాండ్ కోరగా.. కోర్టు మాత్రం తిరస్కరించి బెయిల్ మంజూరు చేసినట్లు తెలుస్తోంది. అనంతరం కాకినాడ పోలీసులు అరెస్టు చేయడం చూస్తుంటే... ఇక వరుసగా ఆయనపై కేసులు నమోదు చేసేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు అర్దమవుతోంది. తద్వారా రావణ్ ను