ప్రశ్న రావణ్ అరెస్ట్
Actor ProfilePolitician

ప్రశ్న రావణ్ అరెస్ట్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై స్పందించిన ప్రకాష్ రాజ్
Samayam Telugu28 Aug 2026
ప్రశ్న రావణ్ అరెస్ట్ పై స్పందించిన ప్రకాష్ రాజ్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ప్రజాస్వ్యామేనా అంటూ ప్రశ్నించారు నటుడు ప్రకాష్‌రాజ్. ఏపీ పోలీసులు వరుసగా ఇద్దరు జర్నలిస్టుల్ని అరెస్ట్‌ చేయడాన్ని ఖండించారు. అధికార దుర్వినియోగానికి పాల్పుడుతూ ఇలా ప్రశ్నించినవారిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఏ రాష్ట్రంలో ఇలా జరిగినా తప్పేనన్నారు. జర్నలిస్టుల అరెస్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లను ట్యాగ్ చేస్తూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.'చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు.. జర్నలిస్టులైన కేవీఆర్, ప్రశ్న రావణ్‌లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాను. మీరిచ్చే ఆదేశాలతో ఇలా ప్రజలపై అధికారాన్ని దుర్వినియోగం చేయడం ఏంటి.. ప్రశ్నిస్తే అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యమేనా?. మన పూర్వీకులు ఇలా చేసి ఉంటే ఈరోజు మనకు ప్రజాస్వామ్యం మిగిలేదా?. ఏ రాష్టమైనా అన్యాయం అన్యాయమే.. ప్రశ్నలకి సమాధానం చెప్పడం మీ బాధ్యత. అరెస్ట్ చేసి గొంతులు నొక్కేయడం మీ పిరికితనం' అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.మరోవైపు జర్నలిస్ట్, యూట్యూబర్ ప్రశ్న రావణ్‌ను ఏపీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పిఠాపురం పోలీసులు మంగళవారం రాత్రి ప్రశ్న రావణ్‌ను అదుపులోకి తీసుకుని పిఠాపురం తరలించారు. ఇటీవల ఏలూరులో నిర్వహించిన దళిత క్రైస్తవుల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాధా మనోహర్ దాస్‌లపై అభ్యంతరక వాఖ్యలు చేశారని ఫిర్యాదు వచ్చింది. జూన్ 29న పిఠాపురం పోలీస్ స్టేషన్‌లో జనసేన కార్యకర్త బొజ్జ కుమార్ ఫిర్యాదు చేయడంతో బీఎన్ఎస్ యాక్ట్ క్రింద సెక్షన్లు 196(1), 352, 356(2), 356(3), 111, ఐటీ చట్టం సెక్షన్ 66 కింద కేసు నమోదయ్యింది.అలాగే తెలంగాణకు చెందిన జర్నలిస్ట్ కేవీఆర్‌ను కూడా ఏపీ పోలీసులు హైదరాబాద్‌‌లో అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీసులు ఆయన్ను నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేష్‌‌పై చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసులో అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలోనూ ఏపీ పోలీసులు కేవీఆర్‌ను అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు