ప్రమోషన్స్ మొదలుపెట్టిన లెనిన్
Actor ProfileActor

ప్రమోషన్స్ మొదలుపెట్టిన లెనిన్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రమోషన్స్ మొదలుపెట్టిన లెనిన్
Chitrajyothy21 Jun 2026
ప్రమోషన్స్ మొదలుపెట్టిన లెనిన్

అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), టాలెంట్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబినేషన్‌లో వస్తోన్న మాస్ యాక్షన్ అండ్ రోమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ (Lenin). అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni), టాలెంట్ అండ్ గ్లామరస్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) కాంబినేషన్‌లో వస్తోన్న మాస్ యాక్షన్ అండ్ రోమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ (Lenin). రాయలసీమ నేపథ్యంలో పక్కా పవర్ ఫుల్ పాలిటిక్స్, ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తోన్నాడు. ఇక ఈ సినిమాను అక్కినేని నాగార్జున నిర్మిస్తోన్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్నీ బావుండి ఉంటే జూన్ 26 న లెనిన్ థియేటర్ లో సందడి చేసేది. కానీ, కొన్ని అనివార్య కారణాల వలన లెనిన్ వాయిదా పడి జులై 10 న ప్రేక్షకుల ముందకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతోన్న తరుణంలో, చిత్ర యూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా అఖిల్, భాగ్యశ్రీ కలిసి స్టార్ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న పాపులర్ చాట్ షో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సుమ.. వారిద్దరి చేత గేమ్స్ ఆడించి, వంట చేయిస్తూ సినిమా గురించి అడిగి తెలుసుకుంది. ఈ చాట్ షోతోనే లెనిన్ ప్రమోషన్స్ మొదలుపెట్టినట్లు అఖిల చెప్పుకొచ్చాడు. ఇక అక్కినేని నాగార్జున సైతం సోషల్ మీడియా వేదికగా ఈ చిత్రం కోసం అఖిల్ వంద శాతం శ్రమించాడని, తెరపై సరికొత్త అఖిల్‌ను చూస్తారంటూ భరోసా ఇవ్వడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఎన్నాళ్లో వేచిన అక్కినేని అభిమానుల నిరీక్షణకు తెరదించుతూ లెనిన్ హిట్ కొడతాడని నమ్మకంగా ఉన్నారు. మరి అయ్యగారు ఈసారైనా అభిమానుల కోరిక నెరవేరుస్తాడా లేదా అనేది చూడాలి