ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత
Actor ProfileActor

ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత
TV9 Telugu31 Jul 2026
ప్రముఖ దర్శకుడు భాగ్యరాజ్ కన్నుమూత

ప్రముఖ నటుడు, దర్శకుడు K.భాగ్యరాజ్ కన్నుమూశారు. దర్శకుడు భాగ్యరాజ్ (73)ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంతో ఇండస్ట్రీ దిగ్బ్రాంతికి గురైంది. భాగ్యరాజ్ గుండెపోటుతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు. దర్శకుడిగానే కాదు నటుడిగానూ 75 సినిమాల్లో నటించారు భాగ్యరాజ్. అలాగే 25 చిత్రాలకు దర్శకత్వం వహించారు. భాగ్యరాజ్ మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది భాగ్యరాజ్ మృతికి సినీ ప్రముఖులు, అభిమానుల సంతాపం తెలుపుతున్నారు. భాగ్యరాజ్ దర్శకత్వం, నటనతో పాటు కొన్ని తెలుగు, హిందీ సినిమాలు, సీరియళ్ళకు కూడా రచించారు. అలాగే కొన్ని నవలలు కూడా రచించారు. ముంధనై ముడిచ్చు (1983) అనే సినిమాకు గాను తమిళనాడు ప్రభుత్వం తరఫున ఉత్తమ నటుడిగా పురస్కారం అందుకున్నారు బాగ్యా రాజ్. అలాగే తెలుగులో చిలిపి పెళ్ళాం, మేం వయసుకు వచ్చాం, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, డిటెక్టివ్‌, అల్లంత దూరాన, 35 చిన్న కథ కాదు సినిమాల్లో నటించారు బాగ్యా రాజ్