ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు
Actor ProfileActor

ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు
TV9 Telugu8 Aug 2026
ప్రభాస్ ఏ దేశం పోయినా ప్రైవసీ ఉండదు.. అందుకే ఆ దేశానికి మాత్రమే వెళ్తాడు.. ఈశ్వర్ నటుడు

ఈశ్వర్ చిత్రంతో ప్రభాస్ చిత్రసీమలోకి అడుగుపెట్టినప్పటి రోజులను నటుడు కృష్ణ మాయ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. అప్పట్లో ప్రభాస్ అమాయకత్వం, అంకితభావం, అలాగే సిగ్గుపడే స్వభావం వంటి అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా రొమాంటిక్ సన్నివేశాలు, ముద్దు సీన్ల చిత్రీకరణ సమయంలో ప్రభాస్ సిగ్గుపడటం తరచుగా జరిగేదని ఆయన గుర్తు చేసుకున్నారు. ఆ రోజుల్లో డిజిటల్ కెమెరాలు లేకపోవడం, ఫిల్మ్ వాడకం చాలా ఖర్చుతో కూడుకున్నది కాబట్టి “వన్ మోర్” షాట్ అడిగే సందర్భాలు తక్కువగా ఉండేవని కృష్ణ మాయ వివరించారు. అయినప్పటికీ, ప్రభాస్ తన నటనపై ఎంత శ్రద్ధ పెట్టేవారంటే, ఒకసారి “వన్ మోర్” సార్ అని అడిగేవారని చెప్పారు. “ఏయ్ బాగుంది, బాగుంది” అని చెప్పి మానిటర్ కూడా చూసుకోకుండానే తదుపరి పనికి వెళ్ళిపోవాల్సి వచ్చేదని పేర్కొన్నారు. స్కూల్ దగ్గర షూటింగ్ జరుగుతున్నప్పుడు, చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు గుమిగూడినప్పుడు ప్రభాస్ ఎంతగా సిగ్గుపడేవాడో కృష్ణ మాయ ఉదాహరణగా చెప్పారు. శ్రీదేవి సైకిల్ మీద వచ్చి పడిన సన్నివేశంలో, ఆమెను గట్టిగా కౌగిలించుకోవడానికి కూడా సిగ్గుపడ్డాడని, డైరెక్టర్ ప్రోత్సాహంతో ఆ సన్నివేశాన్ని పూర్తి చేశాడని ఆయన తెలిపారు. అప్పట్లో ఆ అమాయకత్వమే ప్రజలకు నచ్చిందని, అది అతని ఎదుగుదలకు ఒక కారణమని కృష్ణ మాయ తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్‌కు లభించిన స్టార్‌డమ్, గుర్తింపు గురించి ప్రస్తావిస్తూ, అటువంటి స్థాయి ఉన్నప్పటికీ ప్రభాస్‌లో గర్వం ఎక్కడా కనిపించదని కృష్ణ మాయ పేర్కొన్నారు. తనకు ప్రైవసీ దొరకని స్థాయికి ఎదిగినప్పటికీ, తన స్నేహితుల పట్ల, సహనటుల పట్ల ఆయన చూపించే ఆదరణ అపారమైనదని చెప్పారు. తన జిమ్ ట్రైనర్ లక్ష్మణ్‌కు కోటి రూపాయల విలువైన రేంజ్ రోవర్ కారును బహుమతిగా ఇవ్వడం వంటి అనేక సహాయాలు ప్రభాస్ నిశ్శబ్దంగా చేస్తారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఈశ్వర్ సినిమాలో నటించిన కొందరు వ్యక్తుల గురించి కూడా కృష్ణ మాయ ప్రస్తావించారు. పులి రాంబాబు