ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం రికమెండేషన్ అడిగే రోజులు వచ్చాయి
Actor ProfilePolitician

ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం రికమెండేషన్ అడిగే రోజులు వచ్చాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం రికమెండేషన్ అడిగే రోజులు వచ్చాయి
AP7AM16 Aug 2026
ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం రికమెండేషన్ అడిగే రోజులు వచ్చాయి

వచ్చే ఏడాది ప్రైవేటు పాఠశాలల నుంచి కనీసం రెండు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో చేరాలన్నదే తన లక్ష్యమని, ఈ మార్పునకు ‘షైనింగ్ స్టార్లే’ బ్రాండ్ అంబాసిడర్లని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. భవిష్యత్తులో దేశం మొత్తం ఏపీ విద్యా నమూనా గురించే మాట్లాడుకోవాలని ఆకాంక్షించారు. గత విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘షైనింగ్ స్టార్స్’ పేరుతో ఘనంగా సత్కరించారు. తాడేపల్లిలోని సీఎస్ఆర్ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో టెన్త్ టాపర్లు 55 మందికి రూ. 30 వేల నగదు బహుమతి, ఇంటర్ టాపర్లు 61 మందికి ల్యాప్‌టాప్‌లు, పతకాలు అందజేశారు.ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. “నిద్రలో కనిపించేది కల కాదు, మిమ్మల్ని నిద్రపోనివ్వనిదే నిజమైన కల. నిద్రపోకుండా మీరు పడిన కష్టమే మిమ్మల్ని షైనింగ్ స్టార్స్‌గా నిలబెట్టింది. మీరు గెలిచారు, నన్ను గెలిపించారు, మన విద్యావ్యవస్థను గెలిపించారు. ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం తీసుకొచ్చారు. మీ పనితీరు వల్ల మంత్రిగా నాకు, 2 లక్షల మంది ఉపాధ్యాయులకు గౌరవం పెరిగింది” అని విద్యార్థులను ప్రశంసించారు. ప్రభుత్వ పాఠశాలల్లో సీట్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సులు అడిగే రోజులు వచ్చాయని, మంగళగిరిలో ఒక తల్లి తనను నిడమర్రు స్కూలులో సీటు ఇప్పించాలని కోరిన విషయాన్ని గుర్తుచేశారు.విద్యారంగంలో సమూల మార్పులువిద్యాశాఖను వ్యవసాయంతో పోల్చిన లోకేశ్, ఫలితాలు వెంటనే రావని, నిరంతరం శ్రమిస్తేనే పంట చేతికొచ్చిన ఆనందం దక్కుతుందని అన్నారు. విద్యార్థులను కేంద్రంగా చేసుకుని