ప్రభుత్వ భూమి.. ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు
Actor ProfilePolitician

ప్రభుత్వ భూమి.. ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రభుత్వ భూమి.. ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు
Andhra Jyothy5 Sept 2026
ప్రభుత్వ భూమి.. ప్రైవేటు వ్యక్తి నుంచి కొనుగోలు

అయోధ్య రామాలయం విరాళాల కుంభకోణం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆలయ నిర్మాణానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వినియోగించిన భూమిలో కొంత భాగం... అయోధ్య విరాళాల కుంభకోణం నేపథ్యంలో వెలుగులోకి రామాలయం నిర్మాణం కోసం హనుమాన్‌ గఢి మహంత్‌ నుంచి రూ.23.61 కోట్లతో 1.59 ఎకరాల భూమి కొన్న ట్రస్టు ఆ భూమి ప్రభుత్వానిదని అంతకుముందే ప్రకటించిన జిల్లా కలెక్టరు అది తరతరాలుగా హనుమాన్‌ గఢి భూమేనంటూ మహంత్‌ న్యాయపోరాటం కొనసాగుతున్న సిట్‌ దర్యాప్తు.. అయోధ్య కేసు సీబీఐకి అప్పగించే అవకాశం న్యూఢిల్లీ/లఖ్‌నవూ, జూలై 2: అయోధ్య రామాలయం విరాళాల కుంభకోణం కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ఆలయ నిర్మాణానికి శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు వినియోగించిన భూమిలో కొంత భాగం ప్రభుత్వానిదేనని, ఆ భూమిని ఓ ప్రైవేటు వ్యక్తికి రూ.23.61 కోట్లు ఇచ్చి మరీ ట్రస్టు కొన్నట్లుగా తాజాగా వెల్లడైంది. ఈ వివాదాస్పద భూమి మొత్తం 1.59 ఎకరాలు. 2024 జనవరిలో అయోధ్య జిల్లా కలెక్టరు ఈ భూమిని ప్రభుత్వ భూమిగా ప్రకటించారు. అంటే, ప్రభుత్వ అనుమతితోనే ఈ భూమిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయటంగానీ, లీజుకు తీసుకోవటంగానీ జరగాలి. కానీ, దీనికి విరుద్ధంగా అదే ఏడాది ఏప్రిల్‌లో రామజన్మభూమి ట్రస్టు.. రూ.23.61 కోట్లతో మహంత్‌ మురళీదాస్‌ అనే వ్యక్తి నుంచి కొనుగోలు చేసింది. అయోధ్యలోనే ఉన్న హనుమాన్‌గఢి ఆలయం పూజారి మురళీదాస్‌. ఇదే ఒక విచిత్రం అనుకుంటే.. ఈ వ్యవహారం వెనుక మరిన్ని చిత్రవిచిత్రాలు ఉన్నట్లు తాజాగా బయటపడ్డాయి. సదరు 1.59 ఎకరాల భూమి తనదేనని, తన పేరు మీద 1984 నుంచి రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉందని మురళీదాస్‌ చెబుతున్నారు. 1737లో అవధ్‌ నవాబు ఈ భూమిని హనుమాన్‌గఢీకి కేటాయించారని, తరతరాలుగా అది ఆలయ ప్రధాన పూజారి పేరు మీద కొనసాగుతూ వస్తోందని పేర్కొన్నారు. కాగా, రామాలయ నిర్మాణం పనులు కొనసాగుతున్న నేపథ్యంలో 2023 జూన్‌లో