ప్రపంచంలోనే నంబర్ 1 హీరో అతడు.. షూటింగ్ లో అలా చూసి షాకయ్యా.. టాలీవుడ్ నటుడు
Actor ProfileActor

ప్రపంచంలోనే నంబర్ 1 హీరో అతడు.. షూటింగ్ లో అలా చూసి షాకయ్యా.. టాలీవుడ్ నటుడు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రపంచంలోనే నంబర్ 1 హీరో అతడు.. షూటింగ్ లో అలా చూసి షాకయ్యా.. టాలీవుడ్ నటుడు
TV9 Telugu3 Aug 2026
ప్రపంచంలోనే నంబర్ 1 హీరో అతడు.. షూటింగ్ లో అలా చూసి షాకయ్యా.. టాలీవుడ్ నటుడు

దేవర చిత్రంలో సమర పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు సుదేవ్ నాయర్. మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాలో విలన్ పాత్ర పోషించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, సెట్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ఈ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్ వంటి సహనటులపై ఆయన ప్రశంసలు కురిపించారు. సుదేవ్ నాయర్ బాంబేలో జన్మించినప్పటికీ, త్రివేండ్రంలో పెరిగారు. ఆయన తల్లిదండ్రులు ఇప్పటికీ బాంబేలోనే నివసిస్తున్నారు. సుదేవ్ పూర్తి మలయాళీ. ఆయనకు త్రివేండ్రంలో ఒక సర్ఫ్ స్కూల్ ,రిసార్ట్ ఉంది, దాని నిర్వహణను ఆయన భార్య చూసుకుంటారు. తన కుటుంబంలో తన తల్లికి గోధుమ రంగు కళ్ళు ఉన్నాయని, అయితే తనకు మాత్రం హేజెల్ గ్రీన్ కళ్ళు ఉన్నాయని, ఇవి జనెటిక్స్ అని ఆయన వివరించారు. ఈ ప్రత్యేకమైన కళ్ళు తనను కొన్నిసార్లు భయపెడతాయని, మరికొన్నిసార్లు ఆకర్షిస్తాయని అన్నారు. ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో.. జూనియర్ ఎన్టీఆర్ ప్రొఫెషనలిజంపై సుదేవ్ నాయర్ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్ అత్యంత సంక్లిష్టమైన యాక్షన్ సన్నివేశాలను కూడా ఒకే టేక్‌లో పూర్తి చేస్తారని, డూప్‌లు లేకుండానే అద్భుతంగా చేస్తారని వివరించారు. "మేము రిహార్సల్ చేస్తాం, ఆ తర్వాత ఎన్టీఆర్ వచ్చి కొరియోగ్రఫీని చూసి, ఓకే, డన్, టేక్ అంటారు. రిహార్సల్స్ లేకుండానే ఆయన చేస్తారు," అని చెప్పారు. ఫారెస్ట్ ఫైట్ సీక్వెన్స్‌లో ఒక కష్టమైన సన్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు. "నాకు ఒక సీన్‌లో దూకి, ఎన్టీఆర్ పైకి వెళ్లేటప్పుడు ఆయనను కత్తితో నరకాలి. ఆయన దూకి తప్పించుకోవాలి. మాస్టర్ నాకు వెనుకకు దూకమని చెప్పినప్పుడు, ఎన్టీఆర్ టైమింగ్ కొంచెం భిన్నంగా ఉంటుందని చెప్పాను. నేను దూకడానికి ఎక్కువ సమయం తీసుకుంటాను కాబట్టి, ఆయన త్వరగా దూకితే నన్ను కొట్టే అవకాశం