ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న సొంత రిపోర్టు కార్డ్
Actor ProfileCelebrity

ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న సొంత రిపోర్టు కార్డ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న సొంత రిపోర్టు కార్డ్
AP7AM20 Jun 2026
ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న సొంత రిపోర్టు కార్డ్

పాకిస్థాన్‌లో పాలనా వైఫల్యాలు ఇప్పుడు దేశీయ రాజకీయాలకే పరిమితం కావడం లేదు. అవి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ దేశ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతున్నాయి. మానవ హక్కులు, కార్మిక హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య వ్యవస్థ, అవినీతి నియంత్రణ వంటి అంశాల్లో ఇస్లామాబాద్ తీరుపై సొంత మీడియానే గగ్గోలు పెడుతోంది. ప్రపంచ దేశాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా అమెరికా, యూరోపియన్ యూనియన్ నుంచి వచ్చిన వ్యాఖ్యలు కూడా ఈ చర్చను మరింత ముందుకు తీసుకెళ్లాయి.‘అమెరికా వాణిజ్య ప్రతినిధుల కార్యాలయం’ (యూఎస్‌టీఆర్‌) తాజా సమీక్షలో వెట్టి చాకిరీని అరికట్టడంలో పాకిస్థాన్ తగిన చర్యలు తీసుకోవడం లేదని పేర్కొంది. మరోవైపు యూరోపియన్ యూనియన్ మానవ హక్కులు, కార్మిక రక్షణ, పాలనా సంస్కరణల విషయంలో స్పష్టమైన పురోగతి చూపించాలని పాకిస్థాన్‌ను కోరింది.దేశంలోనే పెరుగుతున్న అసంతృప్తిఇటీవలి కాలంలో పాకిస్థాన్ మీడియా కూడా ప్రభుత్వ పనితీరుపై విమర్శనాత్మక కథనాలు ప్రచురిస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణ, మానవ హక్కులు, కార్మిక హక్కులు ఒత్తిడిలో ఉన్నాయని పలు విశ్లేషణలు చెబుతున్నాయి.పాలన అనే అంశం రాజకీయ నాయకుల ప్రాధాన్య జాబితాలో ఎప్పుడూ ముందుండలేదని స్థానిక మీడియానే విమర్శిస్తోంది. ప్రభుత్వం సంస్కరణలు, అభివృద్ధి పథకాల గురించి పెద్ద ఎత్తున ప్రకటనలు చేసినా సాధారణ ప్రజల జీవితాల్లో మాత్రం పెద్ద మార్పు కనిపించడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అణచివేత, ప్రజలకు సరైన ప్రాతినిధ్యం లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.యువతలో పెరుగుతున్న అసహనంపాకిస్థాన్ జనాభాలో యువతే అత్యధికం. అయితే ఉద్యోగ అవకాశాల కొరత