
Slipper Shot : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే ధోరణి పతాక స్థాయికి చేరితే సామాన్యుడి ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో నిరూపించేలా కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఒక తీవ్రమైన ఘటన


Slipper Shot : ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్య వైఖరి, కార్యాలయాల చుట్టూ తిప్పించుకునే ధోరణి పతాక స్థాయికి చేరితే సామాన్యుడి ఆగ్రహం ఏ విధంగా ఉంటుందో నిరూపించేలా కర్ణాటకలోని బాగల్‌కోట్‌లో ఒక తీవ్రమైన ఘటన

Sanjay Raut: శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) సీనియర్ నాయకుడు, పార్లమెంట్ సభ్యుడు సంజయ్ రౌత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పీఎం మోదీని మొఘల్ పాలకుడు ఔరంగజేబుతో పోలుస్తూ కొత్త వివాదానికి ఉసిగొల్పారు. చారిత్రకంగా ఔరంగజేబు, ప్రస్తుత ప్రధాని మోదీ ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందినవారని ఆయన వ్యాఖ్యానించారు. read also: Ahmedabad Airport: విమానం టాయిలెట్‌లో రూ.4.26 కోట్ల బంగారం స్వాధీనం శనివారం పుణెలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంజయ్ రౌత్ మాట్లాడుతూ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. “మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు జన్మించిన గుజరాత్‌లోని దాహోద్ ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా పుట్టారు. అంటే ఇద్దరూ ఒకే మట్టి నుంచి వచ్చినవారే కదా?” అని ఆయన ప్రశ్నించారు. మోదీ రాజకీయ శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రౌత్.. ఆయన్ను ఒక ‘అఘోరి’గా, అత్యంత ‘కఠిన హృదయుడైన వ్యక్తి’గా అభివర్ణించారు. దేశ రాజకీయ చరిత్రలో ఇంతటి క్రూరమైన మనస్తత్వం ఉన్న నేతను తాను ఎన్నడూ చూడలేదంటూ మండిపడ్డారు. గతంలో దేశాన్ని నడిపించిన జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీతో పాటు శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే వంటి గొప్ప నాయకులు ఈ దేశం కోసం జీవించారని, వారితో మోదీని అస్సలు పోల్చలేమని రౌత్ స్పష్టం చేశారు. అలాగే ప్రతిపక్షాల ‘ఇండియా’ (INDIA) కూటమి గురించి ప్రస్తావిస్తూ.. కూటమిలో పరస్పర సమన్వయం చాలా అవసరమని, రాబోయే రోజుల్లో ఒక సామాన్య పౌరుడు కూడా దేశ ప్రధాని పీఠాన్ని అధిరోహించవచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (BJP) శ్రేణులు నిప్పులు చెరిగాయి. ఈ విమర్శలు కేవలం నరేంద్ర మోదీని మాత్రమే కాకుండా.. మహాత్మా గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ వంటి యుగపురుషులు జన్మించిన పవిత్ర గుజరాత్ గడ్డను, అక్కడి ప్రజలను అవమానించడమేనని బీజేపీ నేతలు ధ్వజమెత్తారు. ప్రభుత్వ