ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది
Actor ProfilePolitician

ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది
Sakshi14 Jul 2026
ప్రధాని అలా అనడం సంతోషంగా ఉంది

రామ్ చరణ్ హీరోగా వచ్చిన రూరల్ స్పోర్ట్స్ డ్రామా పెద్ది. ఈనెల 4న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ ఏకంగా రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. బుచ్చిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా మెప్పించింది. తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్‌ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా తనయుడు రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమా చరణ్ నటించలేదని.. జీవించాడని కొనయాడారు. అంతేకాదు అవార్డుల కంటే చరణ్ నటనపై ప్రశంసలే నాకు ఎక్కువ అని అన్నారు. ఈ సినిమాలో జాతీయ ‍అవార్డ్ ఫర్మామెన్స్ ఇచ్చాడంటూ ఆకాశానికెత్తేశారు. తాజాగా ప్రధాని మోదీ చరణ్‌పై ప్రశంసించడంపై మెగాస్టార్ ట్వీట్ చేశారు. చరణ్‌ను న్యూ ఏజ్ మెగాస్టార్ అని సంభోధించడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉందన్నారు. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరమన్నారు. రామ్ చరణ్ ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానంటూ పోస్ట్ చేశారు. 'పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!” అంటూ సంతోషం వ్యక్తం చేశారు. కాగా.. రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రామ్ చరణ్‌ కూడా పాల్గొన్నారు. కలర్‌ఫుల్ చీరల్లో అందాల అదితీరావ్ (ఫొటోలు) ముంబైని ముంచెత్తుతున్న భారీ వర్షాలు (ఫొటోలు) టీజీ20 లీగ్‌లో ఆటగాళ్ల సందడి...స్పెషల్‌ అట్రాక్షన్‌గా తిలక్‌ వర్మ (ఫొటోలు) తిరుమలలో టాలీవుడ్ యంగ్ హీరోహీరోయిన్ (ఫొటోలు) 'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్.. చిరు-చరణ్ స్పెషల్