
ప్రియదర్శి కథానాయకుడిగా నూతన చిత్రం ‘ఇడుపు కాయితం’ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు. ప్రియదర్శి (Priyadarshi) కథానాయకుడిగా నూతన చిత్రం ‘ఇడుపు కాయితం’ (Idupu kayitham)చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నాగదుర్గ ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం లోకేష్ కనకరాజ్ ఫస్ట్ లుక్‌ను ఆవిష్కరించారు. అల్లు అరవింద్ ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వంశీకృష్ణ మాట్లాడుతూ ‘ఇడుపు కాయితం’ కథ చెప్పగానే నమ్మి సినిమా చేస్తున్నామని గట్టిగా చెప్పిన మా ఆడబిడ్డ తబిత గారికి థ్యాంక్స్. నమ్మితేనే ఎవరైనా పైకి వస్తారు. తెలంగాణ నేపథ్యంలో సాగే కథ ఇది’ అని అన్నారు. నిర్మాత తబిత సుకుమార్ మాట్లాడుతూ 'దర్శకుడు కథ చెబుతున్నప్పుడు మేము చిన్నప్పుడు విన్న విషయాలు, పెద్ద వాళ్లు ఎలా హ్యాండిల్ చేేసవాళ్లు.. ఇవన్నీ గుర్తొచ్చాయి. ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్లిపోయాను. మనం ఎలాగైనా సుకుమార్ రైటింగ్స్‌లో ఈ సినిమా చేయాలని, మనం చేస్తున్నాం అంతే అని సుక్కుకు చెప్పాను. వంశీ ఈ క్యారెక్టర్స్, ఎమోషన్స్ చాలా బాగా రాసుకున్నారు. వంశీ గారు కథ చెబుతున్నప్పుడే విజువల్‌గా చూడగలిగాను. ఈరోజు పోస్టర్ చూశాక కూడా హ్యాపీ ఫీలింగ్ కలిగింది. సినిమా బయటకొచ్చాక ఇలా ఉంటుందేమో, ఆడియెన్స్ బాగా కనెక్ట్ అవుతారు అనిపించింది. సుకుమార్ రైటింగ్స్‌లో ఇదొక మైల్ స్టోన్ లాంటి సినిమా అవుతుంది’ అన్నారు. బన్నీ వాస్ మాట్లాడుతూ ‘మంచి కథతో ఈ సినిమా చేస్తున్నాం. సబ్ టైటిల్స్‌తో బిహార్‌లో వేసినా అక్కడ ప్రేక్షకులు కూడా చూేస చిత్రమిది. మన అందరి ఇళ్లలో ఒక కామన్ ప్రాబ్లమ్ ఉంటుంది. అది పెళ్లయిన వారికి తెలుసు. ఈ సినిమా రిలీజ్