ప్రైవేటీకరణ
Actor ProfilePolitician

ప్రైవేటీకరణ

Total News3
Movie Updates0
Sources2
ప్రైవేటీకరణపై తేల్చేసిన ఆర్టీసీ- పీపీపీ లీజులపై క్లారిటీ
Oneindia Telugu15 Jun 2026
ప్రైవేటీకరణపై తేల్చేసిన ఆర్టీసీ- పీపీపీ లీజులపై క్లారిటీ

ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)లో విద్యుత్ బస్సుల కొనుగోలు, డిపోల లీజు వంటి నిర్ణయాల నేపథ్యంలో ప్రైవేటీకరణ చర్చ ముమ్మరంగా సాగుతోంది. దీంతో ఉద్యోగ సంఘాలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులు ఇవాళ ప్రైవేటీకరణపై నెలకొన్న ఆందోళనలపై స్పష్టత ఇస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆర్టీసీ లీజులతో పాటు పలు అంశాల్ని ప్రస్తావించారు. ఉద్యోగులకు దీనిపై ఆందోళనలు అవసరం లేదన్నారు.ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను వాణిజ్య ఆదాయం సమకూర్చుకునే ఉద్దేశంతో పారదర్శకమైన ఓపెన్ టెండర్ విధానంలో మాత్రమే ప్రైవేట్ సంస్థలకు లీజుకు ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. . ప్రాజెక్టుల స్వభావాన్ని బట్టి లీజు కాలపరిమితి 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, రిటైల్ ఆయిల్ అవుట్‌లెట్ల విషయంలో 20 సంవత్సరాలు, పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో బీవోటీ ప్రాతిపదికన 33/49 సంవత్సరాల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ స్థలాలను బీవోటీ ప్రాతిపదికన పీపీపీ విధానంలో లీజుకు ఇవ్వడం 2005 సంవత్సరం నుండి అమలులో ఉందని గుర్తుచేశారు. సంస్థ ఆర్థిక వనరులను పెంపొందించేందుకు చేపడుతున్న నిరంతర వాణిజ్య అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఈ కేటాయింపులు కాలానుగుణంగా చేపడుతున్నట్లు తెలిపారు. గత 20 ఏళ్లలో ఆర్టీసీక చెందిన సుమారు 24.86 ఎకరాల స్థలాలను 29 ప్రాజెక్టులకు బీవోటీ ప్రాతిపదికన లీజుకు కేటాయించినట్లు తెలిపారు. APSRTC ప్రైవేటీకరణపై తాడోపేడో..! కాసేపట్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటన..!ప్రస్తుతం తిరుపతి బస్ టెర్మినస్ పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, ఈ ప్రాజెక్టుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని ప్రత్యేక సంస్థ అయిన నేషనల్ హైవే లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ (NHLML) సాంకేతిక సహకారం అందిస్తోందన్నారు. ఈ పునర్వ్యవస్థీకరణ ద్వారా అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ఆధునిక బస్ టెర్మినస్‌ను ప్రయాణికులకు అందించడంతో పాటు పీపీపీవిధానంలో స్థిరమైన వాణిజ్య ఆదాయం పొందడం లక్ష్యంగా ఉందన్నారు. దీన్ని ఓపెన్ టెండర్ ద్వారా పారదర్శకంగా స్థల కేటాయింపునకు అవసరమైన మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు

సింగరేణిని కాపాడుకోవడానికి కలిసి పోరాడుదాం
SkyC Media15 Jun 2026
సింగరేణిని కాపాడుకోవడానికి కలిసి పోరాడుదాం

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. కాసిపేట మైన్-1 పరిధిలో నిర్వహించిన

ప్రైవేటీకరణపై తాడోపేడో..! కాసేపట్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటన
Oneindia Telugu8 Jun 2026
ప్రైవేటీకరణపై తాడోపేడో..! కాసేపట్లో ఉద్యమ కార్యాచరణ ప్రకటన

ఏపీఎస్ ఆర్టీసీ (APSRTC)లో విద్యుత్ బస్సులు తీసుకురావడం, వాటి నిర్వహణకు ప్రైవేట్ సంస్థల సాయం తీసుకోవడం, వారికి ఆర్టీసీ డిపోలు అప్పగించడం వంటి చర్యలు ఉద్యోగ, కార్మికుల్లో ఆగ్రహం నింపుతున్నాయి