సేవ్ ది టైగర్స్ గత రెండు సీజన్లు చూసిన తరువాత.. ఎవరి గురించి మాట్లాడుకున్నా మాట్లాడకపోకున్నా.. ప్రియదర్శి, జోర్దార్ సుజాతల గురించి అయితే తప్పకుండా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆయా పాత్రల్లో అంతలా ఒదిగిపోయారు వాళ్లిద్దరూ. తెలంగాణ యాస, భాషల్ని అలవోకగా పలికించిన ఈ అచ్చ తెలుగు తెలంగాణ జంట స్క్రీన్‌పై కనిపిస్తే చాలు ప్రేక్షకులు తెగ ఎంజాయ్ చేశారు. అయితే వీళ్లిద్దరూ కలిసి సేవ్ ది టైగర్స్లోనే కాదు.. అంతకు ముందు ‘మల్లేశం’ సినిమాలో కూడా నటించాల్సి ఉందంట. నాకు సినిమాలు వద్దురా బాబూ.. సుబ్బరంగా టీవీ వార్తలు చదువుకుంటా.. జర్నలిస్ట్‌గానే ఉంటానని జోర్దార్ సుజాత అంటే.. లేదు లేదు.. నువ్వు నా బిడ్డ లాంటి దానివి.. నాకు నిజంగా బిడ్డే ఉంటే.. ఈ సినిమాలో పాత్రని ఆమెతోనే చేయించేదాన్ని. ఆమె లేదు కాబట్టి నువ్వే చేయాలని పట్టుపట్టాడట ‘మల్లేశం’ చిత్ర దర్శకుడు. కూతురు లాంటిదానివని సెంటిమెంట్‌తో కొట్టడంతో సరే అనేసిందట జోర్దార్ సుజాత. రెండే రెండు రోజుల్లో నీకు కాల్ చేస్తాం.. క్యాస్ట్యూమ్స్ కూడా రప్పిస్తాం అని చెప్పిన దర్శకుడు.. రెండు రోజులైనా కూడా చడీచప్పుడు లేకపోవడంతో జోర్దార్ సుజాతనే తిరిగి ఫోన్ చేసేసరికి దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చారట. అదేంటీ.. అసలు సుజాత మల్లేశం సినిమా గురించి ఏం చెప్పిందో చూసేయండి. ‘‘నాకు సినిమాలంటే పెద్దగా ఇంట్రస్ట్ ఉండేది కాదు.. సేవ్ ద టైగర్స్‌కి కూడా అనుకోకుండానే వెళ్లాను. నా బాడీ లాంగ్వేజ్, మాట్లాడే విధానం చూసి మాకు సేమ్ టు సేమ్ ఇలాంటి క్యారెక్టరే కావాలని అడిగారు. ప్రియదర్శి హీరోగా మల్లేశం సినిమా వచ్చింది. ఆ సినిమా డైరెక్టర్ నాకు ఫోన్ చేసి ఈ క్యారెక్టర్ నువ్వే చేయాలి అని అన్నారు. లేదన్నా నేను జర్నలిజంలోనే ఉన్నా.. అదే కెరియర్ అనుకున్నా.. మళ్లీ సినిమాలంటే డైవర్ట్ అవుతుంది.. చేయలేను అని చెప్పాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు. నా ఇంట్లో
Actor ProfileActor
ప్రియదర్శి పక్కన హీరోయిన్ గా పిలిచి ఆ డైరెక్టర్ అవమానించారు
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Jun 2026
ప్రియదర్శి పక్కన హీరోయిన్ గా పిలిచి ఆ డైరెక్టర్ అవమానించారు