
పేరు మార్చుకున్న రష్మిక మందన్నా.. కొత్త పేరు భలే ఉందిగా..పేరు మార్చుకున్న రష్మిక మందన్నా.. కొత్త పేరు భలే ఉందిగా.. 14 June 2026 Basha Shek సాధారణంగా పెళ్లయిన తర్వాత ఆడవాళ్లు భర్త పేరు లేదా భర్త ఇంటిపేరుని తమ పేరు చివరన జోడించుకుంటారు. సామాన్యులే కాదు చాలా మంది హీరోయిన్లు పెళ్లి చేసుకోగానే భర్త ఇంటిపేరు లేదా భర్త పేరుని తమ పేరుకు జోడించుకున్నారు. కానీ రౌడీ బాయ్ హీరో విజయ్ దేవరకొండను ప్రేమించి పెళ్లి చేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న మాత్రం అలా చేయలేదు. ఇప్పటివరకు రష్మిక సోషల్ మీడియా ఖాతాలన్నీ పెళ్లికి ముందు ఉన్న పేరుతోనే కొనసాగాయి. దీంతో రష్మిక పేరులో ఎలాంటి మార్పు ఉండదనుకున్నారు. అయితే తాజాగా రష్మిక కూడా తన పేరును మార్చుకుంది. తన నేమ్ చివరన తన భర్త విజయ్ దేవరకొండ ఇంటి పేరును యాడ్ చేసింది తాజాగా రష్మిక మందన్నా తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి అత్తాగారి సొంతూరు నాగర్‌కర్నూల్ జిల్లా తుమ్మన్‌పేటకు కలిసి వెళ్లారు. అక్కడ ఓ కార్యక్రమంలో రష్మిక మందన్నా ‘ఈ రోజు రష్మిక మందన్న దేవరకొండలా మీ ముందు మాట్లాడుతున్నా' అంటూ తనను తాను పరిచయం చేసుకుంది. మరి త్వరలోనే తన సోషల్ మీడియా ఖాతాల్లో కూడా రష్మిక తన పేరు మార్చుకుంటుందా? లేదా? అన్నది వేచి చూడాలి. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎంగా కీలక భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పుడాయన సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం 'పెద్ది' సినిమా షూటింగ్ పనుల్లో బిజీ బిజీగా ఉంటున్నాడు. బుచ్చిబాబు ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. మా ఊరి పొలిమేర సినిమాతో తెలుగు ఆడియెన్స కు బాగా దగ్గరైపోయింది కామాక్షి భాస్కర్ల. ఇందులో ఆమె అభినయం అందరినీ ఆకట్టుకుంది. సినిమా ఇండస్ట్రీలో అతి సుదీర్ఘ కాలం