ప్ర తీ నెల రూ. 5 వేల పెన్ష న్ .. రూ. 8.5 ల క్ష ల
Actor ProfilePolitician

ప్ర తీ నెల రూ. 5 వేల పెన్ష న్ .. రూ. 8.5 ల క్ష ల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్ర తీ నెల రూ. 5 వేల పెన్ష న్ .. రూ. 8.5 ల క్ష ల
Asianet News Telugu4 Jul 2026
ప్ర తీ నెల రూ. 5 వేల పెన్ష న్ .. రూ. 8.5 ల క్ష ల

భారతదేశంలోని పేద, దిగువ మధ్య తరగతి ప్రజలు, ముఖ్యంగా అసంఘటిత రంగ కార్మికులకు ఆర్థిక భద్రత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. అదే అటల్ పెన్షన్ యోజన (APY). ఈ పథకం ద్వారా, చందాదారులు నెలకు కేవలం రూ.210 చెల్లించడం ద్వారా 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.5,000 వరకు పెన్షన్ పొందవచ్చు. అంతేకాకుండా, రూ.8.5 లక్షల వరకు కార్పస్ ప్రయోజనం కూడా లభిస్తుంది. ఈ పథకాన్ని పింఛన్ నిధి నియంత్రణ, అభివృద్ధి అథారిటీ (PFRDA) నిర్వహిస్తుంది. సాధారణంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ లభిస్తుంది. అయితే, భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీల వంటి అసంఘటిత రంగంలోని వారికి అలాంటి సామాజిక భద్రత ఉండదు. ఈ లోపాన్ని భర్తీ చేయడానికి, 2015 బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజనను ప్రకటించింది. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పెన్షన్ అందించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఇటీవల వెల్లడించిన కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 9 కోట్ల మందికి పైగా ఈ పథకంలో చేరారు. అటల్ పెన్షన్ యోజన (APY) అనేది భారత పౌరులందరికీ అందుబాటులో ఉన్న ఒక సామాజిక భద్రతా పథకం. ఇది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన అసంఘటిత రంగ కార్మికులను లక్ష్యంగా చేసుకుంది. ఈ పథకంలో చేరిన వారు 60 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు నిర్ణీత పెన్షన్ పొందుతారు. ఈ పెన్షన్ మొత్తం వారు చేసే నెలవారీ చెల్లింపులను బట్టి మారుతుంది. అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సున్న భారతీయ పౌరులు అర్హులు. ఈ పథకంలో చేరడానికి పోస్టాఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ బ్యాంకులో సేవింగ్స్ ఖాతా తప్పనిసరి