
Land values : రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూములు, స్థలాలు, నివాస వాణిజ్య ఆస్తుల మార్కెట్ విలువలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన విలువలు అమల్లోకి రావడంతో రియల్ ఎస్టేట్ రంగం, భూ యజమానులు, కొనుగోలుదారులు, నిర్మాణ రంగం, ప్రభుత్వ ఆదాయ వ్యవస్థపై విస్తృత ప్రభా వం పడనుంది. ప్రతి కొన్ని సంవత్సరాలకు ఒకసారి మార్కెట్ పరిస్థితులను పరిశీలించి ఆస్తుల విలువలను సవరించడం సాధారణ పరిపాలనా ప్రక్రియే అయినప్ప టికీ, ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలు, దాని ప్రయో జనాలు, ప్రజలపై పడే భారం వంటి అంశాలు చర్చనీయాం శంగా మారాయి. భూమి అనేది పరిమిత సహజ వనరు. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి కారణాల వల్ల భూమికి డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ముఖ్యంగా నగరాలు, పట్టణాలు, జాతీయ రహదారులు, పారిశ్రామిక కారిడార్లు, కొత్త అభివృద్ధి కేంద్రాల పరిసర పాంతాల్లో భూముల ధర లు గణనీయంగా పెరుగుతున్నాయి. అయితే వాస్తవ మార్కెట్ ధరలకు, ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలకు మధ్య చాలా సందర్భాల్లో భారీ వ్యత్యాసం ఉంటుంది. ఈ వ్యత్యా సం కారణంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం తగ్గడమే కాకుండా, లావాదేవీలలో పారదర్శకత కూడా దెబ్బతింటుంది. అందుకే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా విలువలను సవరించడం అవసరమవుతుంది. Read Also : Adulterated Ghee : భారీ కల్తీ నెయ్యి దందా .. అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు.. 6,500 లీటర్ల నెయ్యి స్వాధీనం! సబ్జిస్ట్రార్ కార్యాలయాల్లో అమలయ్యే మార్కెట్విలువలనుప్రభుత్వం ప్రధానంగా స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుల లెక్కింపు నకు ప్రామాణికంగా ఉపయోగిస్తుంది. మార్కెట్లో ఒక ఎకరం భూమి విలువ కోటి రూపాయలు ఉంటే, ప్రభుత్వ రికార్డుల్లో అది చాలా తక్కువగా నమోదై ఉంటే ఆదాయ నష్టం జరుగుతుంది. అందువల్ల వాస్తవ పరిస్థితులకు దగ్గ రగా విలువలను తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం