
టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మా ఇంటి బంగారంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. నందిని రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ జూన్ 19 నుంచే థియేటర్లలో సందడి చేస్తోంది. సమంత యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసిందని సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీ సామ్ హిట్ కొట్టేసిందని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇదే సమయంలో సమంతపై సోషల్ మీడియాలో రూమర్స్ పెద్దఎత్తున వైరలవుతున్నాయి. మా ఇంటి బంగారం ప్రమోషన్ల తర్వాత సామ్‌పై ఓ టాక్ నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సమంత త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పనుందని టాక్ వినిపిస్తోంది. ఆమెను చూస్తుంటే ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు తెలుస్తోందని కొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇదే నిజమైతే సమంత ఫ్యాన్స్‌కు ఆనందం డబుల్ అని పోస్ట్ చేస్తున్నారు. అయితే వీటిపై సమంత టీమ్ నుంచి ఎలా స్పందన రాలేదు. ముఖ్యంగా మా ఇంటి బంగారం మూవీ ప్రమోషన్లకు సమంత చీరకట్టులోనే హాజరయ్యారు. ఏ ఈవెంట్‌కు నిండు చీరలో అందంగా కనిపించారు. సినీ గ్లామర్ ప్రపంచంలో ఈవెంట్స్‌కు చీరలో వెళ్లడం చాలా అరుదుగా కనిపిస్తుంది. కానీ సామ్ సంప్రదాయబద్ధంగా శారీలో కనిపించడం ప్రెగ్నెన్సీ రూమర్స్‌కు మరింత బలం చేకూరుతోంది. కొందరైతే నెటిజన్ ఏకంగా సామ్ బేబీ బంప్‌తో ఉందని.. అందుకే కనిపించకుండా శారీలోనే ప్రమోషన్లలో పాల్గొన్నారని కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఈ రూమర్స్‌పై సమంత కానీ.. ఆమె టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది. కాగా.. గతేడాది డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో సామ్- రాజ్ నిడిమోరు వివాహం జరిగింది. డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు) హైదరాబాద్ పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వర్షం (ఫొటోలు) సాయికృష్ణ తల్లి విజయలక్ష్మికి వైఎస్ జగన్ పరామర్శ (ఫొటోలు) ఇక నా కొడుకు లేడయ్యా... సాయి కృష్ణ తల్లిని ఓదార్చిన YS జగన్ నా చావుకు CI నాగరాజే కారణం.. క్రాంతి