
తెలుగు ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ZEE5 ప్రేక్షకుల ముందుకు ఒక థ్రిల్లింగ్ మిస్టరీ కథను తీసుకురాబోతోంది. అదే ‘మర్మదేశం అనే ప్రపంచం నుంచి వీరభద్రుని రహస్యం. ఇది జూన్ 26 నుంచి జీ5లో ప్రీమియర్ కానుంది. 1990ల్లో టెలివిజన్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ కల్ట్ మిస్టరీ సిరీస్ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అలాగే తెలుగు ఐఎండీబీ హయ్యస్ట్ రేటింగ్ సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. రహస్యాలతో నిండిన వీరభద్రపురం అనే గ్రామ నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో.. నమ్మకం ఆజ్ఞలను విధించే శక్తిగా మారి..భయం ప్రతి రోజూ అక్కడి ప్రజల జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. దేవుడిపై ఉన్న గాఢ విశ్వాసం నీడలో దాగి ఉన్న ఎన్నో రహస్యాలు ఈ కథలో వెలుగులోకి రాబోతున్నాయి. కథ విషయానికి వస్తే.. తరతరాలుగా వీరభద్రపురం గ్రామ ప్రజలు తమ గ్రామ దైవం వీరభద్ర స్వామి అండలో జీవిస్తుంటారు. గ్రామాన్ని కాపాడే ఆ దేవుడు.. అదే గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే ఆయన శిక్షిస్తాడని అండరూ గాఢంగా నమ్ముతుంటారు. ఆ ఆలయంలోని పవిత్ర గంట మోగినప్పుడల్లా..ఆలయ పరిసరాల్లో ఓ మృతదేహం కనిపిస్తుంది. గడ్డల గుట్టగా శపించబడిన కొండపై మృతదేహాలు కనిపిస్తుంటాయి. ఈ మరణాలను గ్రామస్తులు దైవ న్యాయంగా భావిస్తుంటారు. అయితే వాటి వెనుక నిజం ఏమిటో అని మాత్రం ప్రశ్నించడానికి ఎప్పుడూ ధైర్యం చేయరు. తరతరాలు వారందరూ పాటిస్తున్న సాంప్రదాయం వారిని స్వామికి విధేయులుగా ఉంటూ మౌనంగా కొనసాగేలా చేస్తుంది. దీంతో వారు బలవంతంగా, దశాబ్దాలుగా అక్కడి ప్రజలు ఆ సాంప్రదాయాన్ని పాటిస్తుంటారు. మూఢనమ్మకాలతో నిండిన వింత ప్రపంచలాంటి వీరభద్రపురం అనే ప్రపంచంలోకి సిటీ నుంచి ధైర్యమైన, విషయాన్ని తార్కికంగా ఆలోచించే యువతి వెన్నెల(అన్నీ) అడుగుపెడుతుంది. ఆమె వచ్చిన సమయంలో గ్రామంలో ఓ యువకుడు దారుణంగా హత్యకు గురవుతాడు. అయితే అక్కడి ప్రజలు దాన్ని దైవ శిక్షగా చెబుతారు. కానీ వెన్నెల మాత్రం వారి అంధ