
రీల్ నుంచి మొదలై సినిమాస్కోప్, విస్టావిజన్, ఈస్ట్‌మన్ కలర్, 35mm ఫిల్మ్, 70mm ఫిల్మ్, 2D, 3D, 4DX, IMax.. ఇలా సినిమా రంగంలో సరికొత్త టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. బ్లాక్ అండ్ వైట్ నుంచి మొదలైన సినిమా ప్రయాణం.. ఈరోజు ఐమాక్స్, 4DX లతో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళుతోంది. రీల్ నుంచి మొదలై సినిమాస్కోప్, విస్టావిజన్, ఈస్ట్‌మన్ కలర్, 35mm ఫిల్మ్, 70mm ఫిల్మ్, 2D, 3D, 4DX, IMax.. ఇలా సినిమా రంగంలో సరికొత్త టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంది. ఇందులో 4డిఎక్స్ (4-డైమెన్షనల్ అనుభవం) టెక్నాలజీ అధునాతనమైనది. అసలు 4డిఎక్స్ అంటే ఏమిటి? ఈ టెక్నాలజీ వెనుక ఉన్న విశిష్టత తెలిస్తే.. నిజంగా ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. ఈ మధ్య ఈ పేరు బాగా వినిపిస్తోంది. 3D వరకు ఎంతో మంది ప్రేక్షకులకు తెలుసు. 4DX ఫార్మాట్ గురించి ఇప్పుడిప్పుడే ప్రేక్షకులలోకి వెళ్తోంది. 4DX టెక్నాలజీ విషయానికి వస్తే.. ఇది కేవలం కంటికి కనిపించే టెక్నాలజీనే కాదు, ఒక అనుభూతి అని చెప్పుకోవచ్చు. థియేటర్‌లో సీట్లు సినిమాలోని యాక్షన్ సీన్లకు తగ్గట్టుగా కదులుతాయి. సినిమాలో వర్షం పడితే ప్రేక్షకులపై నీటి చినుకులు పడటం, గాలి వీచడం, బాంబులు పేలితే పొగ రావడం, సువాసనలు, దుర్వాసనలు రావడం వంటివి 4DX థియేటర్లలో జరుగుతాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. ప్రేక్షకుడిని కేవలం సినిమా చూసేవాడిగానే కాకుండా.. ఆ సినిమాలో జరుగుతున్న కథలో తానే స్వయంగా ఒక పాత్రలా ఉన్నాననే అద్భుతమైన భ్రమను కలిగించేలా ఈ ఫార్మాట్ ఉంటుంది. దీనిని ఇమ్మర్సివ్ ఎక్స్‌పీరియన్స్ అని కూడా అంటారు. జపాన్‌లో ఈ టెక్నాలజీ ఇప్పటికే ఆచరణలో ఉంది. 3D సినిమా అంటే ప్రత్యేకమైన కళ్లద్దాలు పెట్టుకోవడం ద్వారా స్క్రీన్‌పై ఉన్న వస్తువులు మన మీదకు వస్తూ.. కేవలం విజువల్ పరంగా మాత్రమే థ్రిల్ ఇస్తుంది. కానీ 4DX అలా కాదు.. పైన