ప్రాక్టీస్ వదిలేసి భర్తతో కలిసి షికార్లు..కోచ్
Actor ProfileCelebrity

ప్రాక్టీస్ వదిలేసి భర్తతో కలిసి షికార్లు..కోచ్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
ప్రాక్టీస్ వదిలేసి భర్తతో కలిసి షికార్లు..కోచ్, కెప్టెన్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు
TV9 Telugu18 Jul 2026
ప్రాక్టీస్ వదిలేసి భర్తతో కలిసి షికార్లు..కోచ్, కెప్టెన్ మధ్య తీవ్ర స్థాయిలో గొడవలు

Pakistan Cricket : ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్ జట్టు పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. మైదానంలో వరుస ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టుకు.. ఇప్పుడు మైదానం వెలుపల జరుగుతున్న వివాదాలు, అంతర్గత ముఠా రాజకీయాలు పెద్ద తలనొప్పిగా మారాయి. జట్టులోని ఆటగాళ్ల మధ్య వాతావరణం అస్సలు బాలేదని, డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఈ వివాదాలపై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు మాత్రం పాక్ పరువును బజారున పడేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరగడానికి ముందు పాకిస్థాన్ జట్టు బస చేసిన హోటల్‌లో ఒక వింత సంఘటన జరిగింది. పాక్ సీనియర్ ప్లేయర్ అలీయా రియాజ్ తన భర్త అలీ యూనిస్‌ను జట్టుకు కేటాయించిన హోటల్ రూమ్‌లో ఉంచుకుంది. దీనిపై పాక్ యువ కెప్టెన్ ఫాతిమా సనా తీవ్రంగా మండిపడింది. టోర్నమెంట్ జరుగుతున్న సమయంలో హోటల్ రూమ్‌లలో బయటి వ్యక్తులకు అనుమతి ఉండదని, క్రమశిక్షణ పాటించాల్సిందేనని ఆమె పట్టుబట్టింది. కెప్టెన్ తీవ్రంగా ఒత్తిడి చేయడంతో అలీయా రియాజ్ భర్త ఆ రూమ్‌ను ఖాళీ చేసి వెళ్లాల్సి వచ్చింది. ఈ హోటల్ రూమ్ వివాదం ఇక్కడితో ముగియలేదు. మరుసటి రోజు బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్ ఉండగా, జట్టు సభ్యులందరికీ కఠినమైన ప్రాక్టీస్ సెషన్ షెడ్యూల్ చేశారు. అయితే సీనియర్ ఆటగాడు అలీయా రియాజ్.. టీమ్ ప్రాక్టీస్‌కు రాకుండా, తన భర్తతో కలిసి లండన్ నగరంలో విహారయాత్రకు వెళ్లిపోయింది. క్రీడా స్ఫూర్తిని, జట్టు నియమాలను పక్కనబెట్టి ఒక సీనియర్ ప్లేయర్ ఇలా ప్రవర్తించడం డ్రెస్సింగ్ రూమ్‌లో మరింత అగ్గి రాజేసింది. కెప్టెన్ ఫాతిమా సనా ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి, ఆమెను జట్టు నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ మ్యాచ్ కోసం ప్లేయింగ్ ఎలెవన్‎ను ఎంపిక చేస్తున్న