
Crows: మనకు చాలా సినిమాల్లో పాములు మనుషులపై పగపట్టడం చూపించారు. మనలో చాలా మంది నిజంగానే పాములు మనపై పగడపడతాయి అని నమ్ముతుంటారు. కానీ, ఇందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలీదు కానీ.. కాకులు మాత్రం మనుషులపై పగపడతాయని మీకు తెలుసా? నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. చాలా పరిశోధనల్లో తేలిన విషయం ఏమిటంటే.. ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి ఏదైనా ఉంది అంటే అది కాకి మాత్రమే. చాలా మంది కాకులను పెద్దగా పట్టించుకోరు.. వాటిని అసహ్యించుకుంటారు. ఇంటి దగ్గరకు వస్తే.. రాళ్లతో దాడి చేస్తారు. కానీ.. మీరు వాటికి హాని చేస్తే మీపై కోపం పెంచుకొని పగ తీర్చుకునేదాకా వదిలిపెట్టవని తెలుసా? కొందరిపై అప్పుడప్పుడు కాకులు సడెన్ గా వచ్చి దాడి చేస్తూ ఉంటాయి. తలమీద తన్నడం, ముక్కుతో పొడవడం లాంటివి చేస్తూ ఉంటాయి. ఇలాంటివి కాకులు వారిపై పగపట్టినప్పుడు మాత్రమే చేస్తాయి. పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే.. ఒక మనిషి ముఖాన్ని కాకులు దాదాపు 17 సంవత్సరాల పాటు గుర్తు పెట్టుకుంటాయట. ఆ కాకి గుర్తుపెట్టుకోవడమే కాదు.. తమ తోటి కాకులకు, తమ పిల్ల కాకులకు కూడా చెబుతాయట. కాకులు నిజంగా మనుషులపై పగ పెంచుకుంటాయా లేదా అనే విషయం తెలుసుకునేందుకు ఓ ఆసక్తికరమైన ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో భాగంగా కొందరు శాస్త్రవేత్తలు ముఖాలకు మాస్క్ లు ధరించి మరీ కాకులను పట్టుకున్నారట. ఆ కాకులకు కొన్ని బ్యాండ్స్ తగిలించారు. ఈ బ్యాండ్స్ కారణంగా కాకులకు ఎలాంటి హాని జరగలేదు. కానీ... తమను పట్టుకున్నప్పుడు ఏ మాస్క్ అయితే ధరించారో.. ఆ మాస్క్ వేసుకున్న ప్రతిసారీ.. కాకులు చాలా భయానికీ, ఒత్తిడికి గురయ్యేవట. ఈ విషయాన్ని వాటికి తగిలించిన బ్యాండ్ ద్వారా ట్రాక్ చేశారు. మాస్క్ వేసుకున్న వ్యక్తి కనిపిస్తే.. కాకులు ప్రమాదానికి సంకేతంగా భావించేవి. వెంటనే కాకులు గట్టిగా అరిచి.. మిగిలిన కాకులను కూడా