
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Papikondalu Tour Break: గోదావరి నదిలో బోటు ప్రయాణం చేస్తూ పచ్చని కొండలు, ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి పాపికొండల విహారయాత్ర ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ప్రతి సంవత్సరం వేలాది మంది పర్యాటకులు ఈ అందాలను దగ్గరగా చూడటానికి పాపికొండలకు తరలివెళ్తుంటారు. గోదావరి నది మధ్యలో సాగే ఈ ప్రయాణం ప్రకృతి ప్రేమికులకు మరపురాని జ్ఞాపకాలను అందిస్తుంది. అయితే, ప్రస్తుతం పాపికొండలు విహారయాత్రకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ షాకింగ్ న్యూస్. పాపికొండలు విహారయాత్రకు వెళ్లే బోట్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు రంపచోడవరం ఆర్డీవో కె. స్వాతి శనివారం ప్రకటించారు. అయితే ఇటీవల దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం నుంచి ఓ బోటులో దాదాపు 89 మంది పర్యాటకులు పాపికొండల విహారయాత్రకు వెళ్లారు. దేవీపట్నం పాత పోలీస్ స్టేషన్ ప్రాంతానికి వెళ్లేసరికి సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బోటును నిలిపివేయడంతో ప్రయాణికులు కొద్దిసేపు భయాందోళనకు గురయ్యారు. మరికొందరు తమను కాపాడాలంటూ కేకలు పెట్టారు. అయితే, పరిస్థితి ప్రమాదకరంగా మారకముందే అక్కడి సిబ్బంది మరో బోటును రప్పించి పర్యాటకులను సేఫ్‌గా తరలించారు. అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన విషయం బయటకు రావడంతో శనివారం అధికార యంత్రాంగం దేవీపట్నం బోటింగ్ పాయింట్‌కు చేరుకొని ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది. బోటు ఎందుకు ఆగిపోయింది? ఘటనను ఎందుకు సీక్రెట్‌గా ఉంచారు? భద్రతా ప్రమాణాలు సక్రమంగా పాటించారా? అనే అంశాలపై సిబ్బందిని ప్రశ్నించినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో పలు సందర్భాల్లోనూ బోటులో ఇలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు గుర్తించిన అధికారులు.. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా పాపికొండల విహార యాత్రను నిలిపివేశారు