పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు
Actor ProfilePolitician

పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు

Total News1
Movie Updates0
Sources1
పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు
Asianet News Telugu16 Jun 2026
పాన్ కార్డ్ యూజర్లకు అలర్ట్.. ఈ 5 లావాదేవీల్లో పాన్ నంబర్ ఇవ్వకపోతే భారీ పెనాల్టీ తప్పదు

ఓటరు కార్డ్, ఆధార్ కార్డ్ తరహాలోనే పాన్ కార్డ్ కూడా మన దేశంలో అత్యంత కీలకమైన పత్రం. అయితే, చాలా మంది పాన్ కార్డ్‌ను కేవలం ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి మాత్రమే అవసరమైన పత్రంగా భావిస్తారు. కానీ వాస్తవానికి, అనేక పెద్ద ఆర్థిక లావాదేవీల నిర్వహణకు పాన్ కార్డ్ చాలా ముఖ్యం. బ్యాంక్ ఖాతా తెరవడం నుండి ఆస్తుల కొనుగోలు, షేర్లలో పెట్టుబడుల వరకు ఎన్నో పనులకు పాన్ నంబర్ ఇవ్వడం చట్టరీత్యా తప్పనిసరి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, పాన్ నంబర్ ద్వారా ఆదాయపన్ను శాఖ దేశంలో జరిగే పెద్ద పెద్ద ఆర్థిక లావాదేవీలపై నిఘా ఉంచుతుంది. ఒక వ్యక్తి ఆదాయం, ఖర్చుల వివరాలు సరిగ్గా నమోదయ్యాయా లేదా అని నిర్ధారించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరి ఏ ఏ లావాదేవీలకు పాన్ కార్డ్ తప్పనిసరిగా ఇవ్వాలో తెలుసా? మొత్తం ఐదు రకాల ముఖ్యమైన లావాదేవీలకు పాన్ నంబర్ ఇవ్వడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మీరు ఏదైనా స్థలం, ఇల్లు లేదా ఫ్లాట్ వంటి ఆస్తిని కొనాలన్నా లేదా అమ్మాలన్నా పాన్ కార్డ్ చాలా ముఖ్యం. ఒకవేళ ఆ లావాదేవీ విలువ రూ.20 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, కచ్చితంగా పాన్ కార్డ్ వివరాలను అందించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ లావాదేవీ ముందుకు సాగదు. మీరు మార్కెట్‌లో లేదా ఏదైనా షోరూమ్‌లో భారీగా షాపింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒకేసారి రూ.2 లక్షల కంటే ఎక్కువ విలువైన వస్తువులను లేదా సేవలను కొనుగోలు చేస్తే పాన్ నంబర్ ఇవ్వడం తప్పనిసరి అవుతుంది. ఇది నగదు రూపంలో లేదా డిజిటల్ రూపంలో చేసినా వర్తిస్తుంది. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టే వారికి కూడా పాన్ కార్డ్ నిబంధనలు ఉన్నాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలలో లిస్ట్ కాని కంపెనీల షేర్లను కొనుగోలు చేసినా లేదా విక్రయించినా పాన్ కార్డ్ అవసరం అవుతుంది. ఈ లావాదేవీల విలువ