పాన్ ఇండియా రేంజ్ లో రీ
Actor ProfileActor

పాన్ ఇండియా రేంజ్ లో రీ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పాన్ ఇండియా రేంజ్ లో రీ- రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ 22 ఏళ్ల పాత సినిమా
Asianet News Telugu20 Jun 2026
పాన్ ఇండియా రేంజ్ లో రీ- రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ 22 ఏళ్ల పాత సినిమా

టాలీవుడ్‌లో మరోసారి రీ రిలీజ్ ట్రెండ్ జోరందుకుంది. గత కొంతకాలంగా స్టార్ హీరోల పాత సూపర్ హిట్ సినిమాలను మళ్లీ థియేటర్లలో విడుదల చేస్తూ.. అభిమానులను ఆకట్టుకుంటున్నారు మూవీ మేకర్స్. గతంలో తమ అభిమాన హీరో సినిమాలను థియేటర్లలో చూడలేకపోయిన అభిమానులు.. ఈ అవాకాశాలను ఉపయోగించుకుంటున్నారు. అంతే కాదు రీరిలీజ్ అయ్యే థియేటర్లలో అభిమానులు సీన్ రీ క్రియేట్ చేస్తూ.. వైరల్ అవుతున్నారు. ఇక తాజాగా కొంత మంది హీరోల పాత సినిమాలు రీరిలీజ్ కు క్యూ కడుతున్నాయి. ఈ నెల 26 నుంచి స్టార్ హీరోలకు చెందిన పలు క్లాసిక్ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. స్టార్ హీరోల సూపర్ హిట్ పాత సినిమాలు ఈ నెల చివరి నుంచి థియేటర్లకు క్యూ కడుతున్నాయి. ఈనెల 26న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ఒక్కడు రీరిలీజ్ కాబోతోంది. ఈ మూవీ ఇప్పటికే ఒక సారి రీరిలీజ్ చేశారు. మరో సారి రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఇక ఇదే రోజు పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ ను కూడా రీ రిలీజ్ చేయాలని చూశారు మేకర్స్.. కానీ పెద్ది సినిమా కలెక్షన్స్ కు ఇబ్బంది లేకుండా గబ్బర్ సింగ్ రీరిలీజ్ ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ స్వయంగా వెల్లడించారు. ఇక ఈమూవీతో పాటు జూన్ 27న మంచు విష్ణు కన్నప్ప కూడా రీరిలీజ్ కాబోతోంది. ఇక రీరిలీజ్ ట్రెండ్ లో అల్లు అర్జున్ సినిమాలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఇక్కడే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా బన్నీ మూవీస్ ను విపరీతంగా ఆదరిస్తున్నారు అభిమానులు. కేరళలో అల్లు అర్జున్ కు భారీగా అభిమానులున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలన్నీ కేరళలో భారీగా కలెక్షన్స్ ను కూడా రాబడతాయి. రీసెంట్ గా అల్లు అర్జున్ హ్యాపీ మూవీని కేరళలో రీరిలీజ్