సాధారణంగా ఏదైనా సీరియల్ చూస్తున్నామంటే.. హీరో గురించో, హీరోయిన్ గురించో చెప్పుకోవడం చాలా కామన్. కానీ పొదరిల్లు సీరియల్‌లో తండ్రి పాత్రలో కనిపిస్తున్న నారాయణ గురించి చెప్పుకోకుండా ఉండరు. పొదరిల్లు సీరియల్‌లో తన అద్భుత నటనతో మెప్పిస్తున్న నారాయణ అసలు పేరు కాకినాడ నాని ( Kakinada Nani ) అతన్ని చూడగానే తాగుబోతు తండ్రి గుర్తొస్తారు. కానీ ఆయనకి అసలు తాగుడే అలవాటు లేదంట. ఇదొక్కటే కాదు.. తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి చాలా విషయాలను చెప్పుకొచ్చారు కాకినాడ నాని. ‘నా పేరు కాకినాడ నాని.. పొదరిల్లు సీరియల్‌లో తాగుబోతు తండ్రిగా జనాలు నన్ను గుర్తించారు. నన్ను చూడగానే.. ఫుల్ తాగారా? అని అడుగుతారు కానీ.. ఆ దేవుడి దయవల్ల నాకు అసలు తాగుడు అలవాటే లేదు. సీరియల్‌లో మాత్రమే పెగ్ వేస్తా కానీ.. రియల్ లైఫ్‌లో మందు తాగను, సిగరెట్ తాగను. ఎంతో అదృష్టం చేసుకుంటేనే కానీ.. పొదరిల్లు లాంటి క్యారెక్టర్ రాదు. నా కష్టానికి ఇన్నాళ్లకి ప్రతిఫలం దక్కింది. నేను థియేటర్ ఆర్టిస్ట్‌ని. 30 ఏళ్లుగా నాటికలు, నాటకాలు వేశాను. చాలా అవార్డులు వచ్చాయి. అదే ఇప్పుడు నాకు తిండిపెడుతుంది. ఇప్పుడు నాకు 53 ఏళ్లు. ఈ మధ్య నేను ‘పొదరిల్లు’ సీరియల్ ద్వారా జనం గుర్తించారు కానీ.. బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి సినిమాల్లో కూడా చేశాను. నేను కాకినాడలో ఉంటా కానీ.. ఏదైనా వేషం ఉంటే వస్తాను.. చేస్తాను. కరోనా తరువాత హైదరాబాద్‌కి వచ్చేశాను. అందరూ కాకినాడ నాని అని అంటారు కానీ.. నా అసలు పేరు చిలకచర్ల సూర్య నారాయణ. ఆర్జీవీ గారెతో ఐదు సినిమాలు చేశాను. వంగవీటి, ఎటాక్ వంటి సినిమాల్లో కూడా చేశాను. చిలకచర్ల సూర్య అంటే.. అప్పటికే వేరే సూర్య ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి.. నాని అని మార్చుకున్నా. కాకినాడ కాబట్టి.. కాకినాడ సూర్య అయ్యాను. కేవలం ఆర్టిస్ట్‌గానే కాకుండా
Actor ProfileActor
పొదరిల్లు’ ఫాదర్ ఇంటర్వ్యూ.. తాగుబోతు తండ్రినే కానీ మందు అలవాటే లేదు.. సాక్షి
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Aug 2026
పొదరిల్లు’ ఫాదర్ ఇంటర్వ్యూ.. తాగుబోతు తండ్రినే కానీ మందు అలవాటే లేదు.. సాక్షి,వార్తలో జర్నలిస్ట్ గా ప్రయాణం