పెద్ది’ సక్సెస్ చూసి నాకు ఠాగూర్’ లోని డైలాగ్ గుర్తొచ్చింది
Actor ProfilePolitician

పెద్ది’ సక్సెస్ చూసి నాకు ఠాగూర్’ లోని డైలాగ్ గుర్తొచ్చింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెద్ది’ సక్సెస్ చూసి నాకు ఠాగూర్’ లోని డైలాగ్ గుర్తొచ్చింది
Chitrajyothy12 Jul 2026
పెద్ది’ సక్సెస్ చూసి నాకు ఠాగూర్’ లోని డైలాగ్ గుర్తొచ్చింది

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చి బాబు సానా కాంబోలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’. ఈ సినిమా సక్సెస్‌ను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వేడుకలో రామ్ చరణ్ స్పీచ్ హైలెట్ అవుతోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan), బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) కాంబోలో వచ్చిన లేటెస్ట్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ (Peddi). మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్ర సక్సెస్‌ని పురస్కరించుకుని మంగళవారం హైదరాబాద్‌లో ‘పెద్ది మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్’ (Peddi Blockbuster Event)ని మేకర్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. తన తండ్రి నటించిన ‘ఠాగూర్’ సినిమాలోని డైలాగ్ గుర్తొస్తోంది అంటూ.. ఆసక్తికరంగా స్పీచ్ ఇచ్చారు. ‘‘కొన్ని విజయాలు మనల్ని ఆనందపరుస్తాయి. కొన్ని విజయాల గురించి ఆలోచిస్తే మనసు చాలా తృప్తిగా ఉంటుంది. ‘పెద్ది’ విజయం మాత్రం నా జీవితాన్నే మార్చేసిందని చెప్పగలను. ‘పెద్ది’ లాంటి అనుభూతి నాకు ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. అలాంటి గొప్ప అనుభూతిని ప్రేక్షకులు నాకు అందించారు. ఈ సినిమా ద్వారా నా గుండెల్లో జీవితాంతం దాచుకునే జ్ఞాపకాన్ని ఇచ్చారు. అందుకే ముందుగా ప్రేక్షకులందరికీ థ్యాంక్యూ. నేను సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే చాలా కొత్త ఆడియన్స్ థియేటర్లకు వచ్చినట్లు అనిపించింది. చిన్న పిల్లలు ‘మస్సా మస్సా’ పాటకు డ్యాన్స్ చేయడం చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. పేరెంట్స్ ఎంత నమ్మకం పెడితే తమ పిల్లలను కూడా థియేటర్లకు తీసుకొస్తారో.. అది ఈ సినిమా ద్వారా తెలిసింది. ఇది బుచ్చిబాబు చేసిన ప్రయత్నానికి దక్కిన గొప్ప గౌరవం. చిన్నవాళ్లతో పాటు పెద్దవాళ్లు, ముసలివాళ్లు కూడా లుంగీలు కట్టుకుని డ్యాన్స్ చేస్తూ కనిపించడం నాకు చాలా కొత్త అనుభూతిని ఇచ్చింది