పెద్ది’ విలన్ కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా
Actor ProfileActor

పెద్ది’ విలన్ కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా

Total News1
Movie Updates0
Sources1
పెద్ది’ విలన్ కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా
NTV Telugu15 Jun 2026
పెద్ది’ విలన్ కి త్రివిక్రమ్ క్రేజీ ఆఫర్.. వెంకీ ఆదర్శ కుటుంబం’ లోకి మున్నా భయ్యా

Divyendu Sharma: టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న బాలీవుడ్ నటుడు, ‘మీర్జాపూర్’ ఫేమ్ దివ్యేందు శర్మ ఖాతాలో మరో భారీ క్రేజీ ప్రాజెక్ట్ చేరినట్లు సమాచారం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రంలో ‘రామ్‌బుజ్జి’గా నెగటివ్ షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ పాత్రతో తెలుగు తెరకు పరిచయమైన దివ్యేందు.. ఇప్పుడు మరొక క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. విక్టరీ వెంకటేష్ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47’ (#AK47) చిత్రంలో దివ్యేందు శర్మ ఒక కీ రోల్‌లో నటించనున్నట్లు సమాచారం. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ ఫ్యామిలీ క్రైమ్ డ్రామాపై ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత వెంకీ – త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతుండటంతో బిజినెస్ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ హాట్ కేకులా మారింది. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దివ్యేందు శర్మ క్యారెక్టర్ మేకర్స్ కథను మలుపు తిప్పే విధంగా డిజైన్ చేశారట. ఈ భారీ చిత్రాన్ని రాబోయే విజయదశమి (దసరా) పండుగ కానుకగా థియేటర్లలోకి గ్రాండ్‌గా తీసుకురావడానికి మేకర్స్ పక్కా ప్లాన్‌తో ఉన్నట్లు సమాచారం. ‘పెద్ది’ తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రామ్‌బుజ్జి క్రేజ్, ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్‌కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. దివ్యేందు రోల్‌పై తర్వలోనే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం