పెద్ద ప్లానింగే..! రాజమౌళి
Actor ProfileActor

పెద్ద ప్లానింగే..! రాజమౌళి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెద్ద ప్లానింగే..! రాజమౌళి, సందీప్ రెడ్డి నాతో సినిమా చేయాలి
TV9 Telugu23 Jun 2026
పెద్ద ప్లానింగే..! రాజమౌళి, సందీప్ రెడ్డి నాతో సినిమా చేయాలి

యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్.. చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. సినిమాలతో హీరోగా క్రేజ్ తెచ్చుకోవడం కంటే వివాదాల్లో ఎక్కువగా మనోడి పేరు వినిపించింది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చంద్రహాస్ మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తన సినీ రంగ ప్రవేశం, ఎదురైన సవాళ్లు, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలిపాడు. పరిశ్రమలో చాలామంది హీరోలు కష్టపడి స్టార్ ట్యాగ్‌ను పొందడానికి కృషి చేస్తే, తనకు మాత్రం మొదటి సినిమా విడుదల కాకముందే ఆడియెన్స్ నుంచి “ఆటిట్యూడ్ స్టార్” అనే ట్యాగ్ వచ్చిందని చంద్రహాస్ సంతోషంగా తెలిపాడు. ఈ ట్యాగ్ తన బర్త్‌డే ప్రెస్ మీట్ ద్వారా వైరల్ అయిందని చంద్రహాస్ వివరించాడు. నాటు నాటు కవర్ సాంగ్ చేసిన తర్వాత తనకు మూడు సినిమా ఆఫర్లు వచ్చాయని, అప్పుడే తన తండ్రి తన పుట్టినరోజు సందర్భంగా ఈ మూడు సినిమాల ప్రకటన కోసం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ప్రెస్ మీటే తనకు “ఆటిట్యూడ్ స్టార్” ఇమేజ్‌ను తెచ్చిపెట్టిందని, అది తనను అస్సలు ఇబ్బంది పెట్టలేదని, బదులుగా ఆడియెన్స్ ప్రేమగా పిలిచే పేరుగా మారిందని అన్నాడు. స్కూల్ ఈవెంట్స్ లేదా ఏదైనా ప్రారంభోత్సవాలకు అతిథిగా వెళ్లినప్పుడు కూడా ప్రజలు తన పేరు కంటే “ఆటిట్యూడ్ స్టార్” అని పిలవడానికి ఇష్టపడతారని చెప్పుకొచ్చాడు. తన తొలి చిత్రం రామ్ నగర్ బన్నీ గురించి వచ్చిన పుకార్లపై చంద్రహాస్ వివరణ ఇచ్చాడు. సినిమా వల్ల నష్టాలు వచ్చాయని, ఆస్తులు అమ్మాననే వార్తల్లో నిజం లేదని ఖండించారు. థియేటర్లలో 60-70 శాతం ఆక్యుపెన్సీతో సినిమా బాగా నడిచిందని, ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ ఆహాలో చాలా మంచి వ్యూస్‌ను సాధించిందని తెలిపాడు. ఆహా సంస్థ కూడా తాము సక్సెస్ మీట్ పెట్టుకోవచ్చని సూచించిందని పేర్కొన్నాడు శాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానెల్ కొనుగోలు చేసిందని, మ్యూజిక్ రైట్స్ ద్వారా తమ ఓన్