పెద్ది’ డిజిటల్ ఎంట్రీ లేట్... ఓటీటీ వీక్షకులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే
Actor ProfileActor

పెద్ది’ డిజిటల్ ఎంట్రీ లేట్... ఓటీటీ వీక్షకులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పెద్ది’ డిజిటల్ ఎంట్రీ లేట్... ఓటీటీ వీక్షకులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే
Samayam Telugu27 Aug 2026
పెద్ది’ డిజిటల్ ఎంట్రీ లేట్... ఓటీటీ వీక్షకులు మరికొన్ని రోజులు ఆగాల్సిందే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ థియేటర్లలో ఏ స్థాయి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ ఏకంగా రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. వెండితెరపై మెగా పవర్ స్టార్ ర్యాంపేజ్‌ చూసి మురిసిపోయిన అభిమానులు, ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ ఎంట్రీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా వినిపిస్తోన్న ప్రచారం మెగా అభిమానులను కాస్త నిరాశకు గురిచేస్తోంది.* ‘మురారి’ హిట్ అయ్యింది.. కానీ నా కెరీర్ ఆగిపోయింది: రఘుబాబు షాకింగ్ కామెంట్స్ ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యంఫిల్మ్ నగర్ సమాచారం ప్రకారం.. ‘పెద్ది’ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు కైవసం చేసుకుంది. జూన్ 4న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, నాలుగు వారాల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుని 2026, జూలై 2 నుంచే ఓటీటీలోకి వచ్చేస్తుందని గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. నెట్టింట దీనిపై ఎన్నో కథనాలు కూడా హల్‌చల్ చేశాయి. కానీ, తాజా బజ్ ప్రకారం ఈ సినిమా ఓటీటీ విడుదలను మేకర్స్ మరో రెండు వారాల పాటు ముందుకు నెట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న లీకుల మేరకు, జూలై 2కి బదులుగా జూలై 16 నుండి ‘పెద్ది’ చిత్రాన్ని నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి తీసుకురావాలని సదరు సంస్థ యోచిస్తోందట. అయితే దీనిపై నెట్‌ఫ్లిక్స్ నుంచి కానీ, నిర్మాణ సంస్థ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. పూర్తి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.* జీవితాంతం ఆ కఠినమైన డైట్ తప్పదు.. సమంత హెల్త్ కండిషన్‌పై చేదు నిజాలు పంచుకున్న నందిని రెడ్డిమరోవైపు ఈ సినిమా హిందీ వెర్షన్ స్ట్రీమింగ్‌కు సంబంధించి కూడా ఒక