'పెద్ది' సినిమా రెండు వారాల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరోహీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా తెరకెక్కింది. ఆడియన్స్ నుంచి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర గట్టిగానే నిలబడింది. 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.393 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రూ. 400 కోట్ల పోస్టర్ కోసం మెగా అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాతో నిర్మాతకు భారీ నష్టం వాటిల్లిందని కమల్ ఆర్ ఖాన్ పోస్ట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. కమల్ ఆర్. ఖాన్.. ఈయన గురించి సినీ ప్రియులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పలు హిందీ, భోజ్ పురి సినిమాల్లో నటించిన ఈ అపర మేధావి.. తనకు తాను ఫిలిం క్రిటిక్ గా చెప్పుకుంటూ, సోషల్ మీడియా వేదికగా సినిమాలకు సమీక్షలు ఇస్తుంటాడు. తనకు నచ్చని చిత్రాలపై విషం కక్కుతుంటాడు. సౌత్ హీరోలు, సినిమాలపై బురద చల్లడమే పనిగా పెట్టుకుంటాడు. ఏదైనా పెద్ద మూవీ వస్తుందంటే చాలు, పని గట్టుకుని మరీ విమర్శలు చేస్తుంటాడు. ఈ వివాదాస్పద సమీక్షకుడు ఇప్పుడు 'పెద్ది' సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ''పెద్ది' సినిమా నిర్మాత ₹125 కోట్ల భారీ నష్టాన్ని చవిచూస్తుంటే, తనను తాను స్టార్‌గా చెప్పుకునే రామ్ చరణ్ మాత్రం ఆ సినిమా సక్సెస్ అయిందని సెలబ్రేట్ చేసుకుంటున్నాడు. మీడియా కూడా దీనిని 'హిట్' సినిమాగా పేర్కొంటోంది. మీడియా ఎంతటి సిగ్గులేని స్థితికి దిగజారిందో చెప్పడానికి ఇదే నిదర్శనం. హిందీ సర్క్యూట్‌లో ఈ సినిమా సాధించిన మొత్తం వసూళ్లు కేవలం ₹15 కోట్లు మాత్రమే'' అని కమల్ ఆర్. ఖాన్ ఎక్స్ లో రాసుకొచ్చాడు. దీనికి చరణ్ ని కూడా ట్యాగ్ చేశాడు. ఇది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేఆర్కేపై మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర
Actor ProfileActor
పెద్ది’కి రూ.125 కోట్ల నష్టం.. హిందీలో జస్ట్ రూ.15 కోట్లే వసూళ్లు.. రేయ్ ఎవడ్రా వీడూ
📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•17 Jun 2026
పెద్ది’కి రూ.125 కోట్ల నష్టం.. హిందీలో జస్ట్ రూ.15 కోట్లే వసూళ్లు.. రేయ్ ఎవడ్రా వీడూ