Temple Cities Investment: భారత దేశంలో ఒకప్పుడు ఆధ్యాత్మిక నగరాల సందర్శన కేవలం వృద్ధాప్యంలో లేదా పుణ్యం కోసం వెళ్లే యాత్రలకు పరిమితం అయ్యేది. కానీ ఇప్పుడు ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు ఇప్పుడు మల్టీ మిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ మార్కెట్లుగా అభివృద్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా అయోధ్యలో రామాలయం నిర్మాణం, వారణాసిలో కాశీ విశ్వనాథ్ కారిడార్, తిరుపతి, పూరీ వంటి నగరాల్లో మౌలిక వసతుల విప్లవం తర్వాత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అంతా టెంపుల్ సిటీల వైపు పరుగులు తీస్తున్నారు. అయితే, సెలబ్రిటీలను చూసి సామాన్యులు కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చా, ఈ మార్కెట్ వెనుక ఉన్న రిస్కులు ఏంటి?ఇటీవలి కాలంలో ఆధ్యాత్మిక నగరాల్లో ముఖ్యంగా అయోధ్యలో సెలబ్రిటీల ల్యాండ్ డీల్స్ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలోని ఒక లగ్జరీ 7 స్టార్ ఇన్‌క్లేవ్ ది సరయూ ప్రాజెక్టులో సుమారు రూ.14.5 కోట్లతో 10 వేల చదరపు అడుగుల ప్లాట్ కొనుగోలు చేశారు. అయోధ్యలోని అదే ప్రాజెక్టులో బాలీవుడ్ యాక్టర్ రణ్‌బీర్ కపూర్ ఇటీవలే రూ.3.31 కోట్లతో 2,134 చదరపు అడుగుల ప్లాట్ కొన్నారు. వీరితో పాటు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ నిర్మాతలు, పారిశ్రామికవేత్తలు వారణాసి, హరిద్వార్, పూరి, మథుర వంటి ప్రాంతాలలో కమర్షియల్ స్థలాలు, హోటళ్లు, రిసార్ట్స్ కోసం భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ధరలు పెరిగేందుకు కారణాలుకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఆధ్యాత్మిక నగరాల కనెక్టివిటీని భారీగా పెంచాయి. కొత్త ఎయిర్ పోర్టులు, వందే భారత్ రైళ్లు, ఫోర్ లేన్ హైవేల వల్ల పర్యాటకుల సంఖ్య కోట్లలోకి చేరింది. కేవలం భక్తులే కాకుండా స్పిరిచువల్ టూరిజం కోసం వచ్చే యువత, ఎన్ఆర్ఐల సంఖ్యా భారీగా పెరిగింది. దీనివల్ల హోటళ్లు, హోమ్ స్టేలు, లాడ్జీలకు డిమాండ్ పెరిగి, ల్యాండ్ విలువ 2-3 ఏళ్లలోనే కొన్ని ప్రాంతాల్లో
Actor ProfilePolitician
పుణ్యక్షేత్రాల్లో 'సెలబ్రిటీల' పెట్టుబడులు.. 'అమితాబ్' వంటి స్టార్స్ బాటలో మనమూ భూములు కొనొచ్చా
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•14 Jun 2026
పుణ్యక్షేత్రాల్లో 'సెలబ్రిటీల' పెట్టుబడులు.. 'అమితాబ్' వంటి స్టార్స్ బాటలో మనమూ భూములు కొనొచ్చా