పంజాబ్ కు ముందస్తు ఎన్నికలు... హింట్ ఇచ్చిన కేజ్రీవాల్
Actor ProfilePolitician

పంజాబ్ కు ముందస్తు ఎన్నికలు... హింట్ ఇచ్చిన కేజ్రీవాల్

Total News1
Movie Updates0
Sources1
పంజాబ్ కు ముందస్తు ఎన్నికలు... హింట్ ఇచ్చిన కేజ్రీవాల్
Andhra Jyothy13 Jun 2026
పంజాబ్ కు ముందస్తు ఎన్నికలు... హింట్ ఇచ్చిన కేజ్రీవాల్

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందుగానే జరిగే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంకేతాలిచ్చారు. 2027 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2026 నవంబర్‌లోనే ఎన్నికలు జరగవచ్చని అన్నారు. చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు గడువు కంటే ముందుగానే జరిగే అవకాశం ఉందని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంకేతాలిచ్చారు. 2027 ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 2026 నవంబర్‌లోనే ఎన్నికలు జరగవచ్చని అన్నారు. 'ఆప్' ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ కొనసాగుతారని ప్రకటించారు. బటిండాలో శనివారంనాడు జరిగిన రోడ్‌షోలో కేజ్రీవాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ కార్యకర్తలు తక్షణం ఎన్నికల ప్రచారానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముందస్తు ఎన్నికలకు కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచిన ఓటర్లకు కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. బర్నాలా, మోగా, బటాలా, బటిండా మున్సిపల్ కార్పొరేషన్లకు మేయర్లుగా ఆప్ కౌన్సిలర్లు ఎన్నికయ్యారని, పార్టీ పాలనపై ప్రజలకున్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తోందని అన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా భగవంత్ మాన్ కొనసాగుతారని, మరో సారి మాన్ సీఎం అయ్యేందుకు పార్టీ కార్యకర్తలందరూ కృషి చేయాలని కేజ్రీవాల్ కోరారు. గత నాలుగేళ్లుగా పంజాబ్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని, మద్దతును సాధించిందని అన్నారు. పార్టీల పేరు చెప్పకుండా విపక్షాలపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. ఒకటి 'చిట్టా పార్టీ', మరొకటి 'ఫైటింగ్ పార్టీ', మూడో పార్టీ 'ఈడీ పార్టీ' అని అభివర్ణించారు. డ్రగ్స్ సమస్యలు, అంతర్గత పోరాటాలు, సెంట్రల్ ఏజెన్సీలతో ప్రత్యర్థులను భయపెట్టే పార్టీలుగా వారిని పోల్చారు. ప్రజాసంక్షేమ, అభివృద్ధి కోసం పని చేసే పార్టీ ఆప్ మాత్రమేనని, పంజాబ్ నేతల్లో అత్యంత నిజాయితీ కలిగిన ముఖ్యమంత్రుల్లో భగవంత్ మాన్ ఒకరని ప్రశంసించారు. గత