
‘‘పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం పిటిషన్లు తీసుకుని వాటిని పైకి నెట్టేసే వ్యవస్థలా కాకుండా ప్రజల కష్టాలు తీర్చే పవర్‌హౌస్‌లా మారాలి.’’ అని ఆ శాఖ మం త్రి, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. 36 ఏళ్ల ప్రస్థానంలో మచ్చలేని వ్యక్తి వెంకటకృష్ణ ఓఎస్‌డీ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో పవన్‌కల్యాణ్ అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ‘‘పంచాయతీరాజ్ వ్యవస్థ కేవలం పిటిషన్లు తీసుకుని వాటిని పైకి నెట్టేసే వ్యవస్థలా కాకుండా ప్రజల కష్టాలు తీర్చే పవర్‌హౌస్‌లా మారాలి.’’ అని ఆ శాఖ మం త్రి, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడలోని ఓ హోటల్‌లో నిర్వహించిన ఓఎస్‌డీ వెంకటకృష్ణ పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ.. పాలనాపరంగా తనకు పెద్దగా అనుభవం లేకపోయినా 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖను ఇంత విజయవంతంగా నిర్వహించడానికి వెంకటేకృష్ణే కారణమన్నారు. వెంకటకృష్ణకు తాను బాస్ అయినప్పటికీ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ యూనివర్సిటీలో ఆయన తనకు గురువులాంటి వారని తెలిపారు. రెండు నెలల పాటు తాను పంచాయతీరాజ్‌శాఖ గురించి ఆయన వద్ద శిక్షణ తీసుకున్నట్టు చెప్పారు. 36 ఏళ్ల సుదీర్ఘ సర్వీసులో ఆయనపై చిన్నపాటి మరక కూడా లేదన్నారు. అలాంటి వ్యక్తి రిటైర్ అవుతున్నారని తెలియగానే భుజం కొట్టేసినట్లనిపించిందన్నారు. అందుకే ఆయన సేవలు మరో మూడేళ్లు కొనసాగేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. వెంకటకృష్ణ నీతి నిజాయితీకి నిలువుటద్దంలాంటి వారని పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ అన్నారు