పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి
Actor ProfilePolitician

పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి
HMTV3 Sept 2026
పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి

P Gannavaram: పి.గన్నవరంలో వీబీజీ రాంజీ పథకం ప్రారంభం ఎమ్మెల్యే గిడ్డి పి.గన్నవరం: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా, పి. గన్నవరం మండలం నాగులంక గ్రామంలో ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిడ్డి సత్యనారాయణ VBGRAMG (వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ – గ్రామీణ్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు నాంది పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పన, వ్యవసాయాభివృద్ధి, మహిళా సాధికారత, యువతకు అవకాశాల కల్పన మరియు గ్రామ స్వయం సమృద్ధే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్–2047 దార్శనికతకు అనుగుణంగా గ్రామీణాభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం లభిస్తోందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి, సాంకేతికత, పారదర్శక పాలన మరియు గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. అదేవిధంగా, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రజాసేవా దృక్పథం, గ్రామీణ సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ మరియు యువత సాధికారతకు అందిస్తున్న ప్రాధాన్యం గ్రామాల సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉపాధి అవకాశాల పెంపు, నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, చెరువుల పునరుద్ధరణ, గ్రామ రహదారుల అభివృద్ధి, హరితహారం, పారిశుధ్యం, మహిళల ఆర్థిక సాధికారత మరియు యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని ఆయన వివరించారు. గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అత్యంత ముఖ్యమని పేర్కొంటూ, ప్రతి గ్రామం స్వయం సమృద్ధి సాధించి వికసిత్ భారత్–2047 లక్ష్య సాధనలో భాగస్వామి కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, రైతులు, మహిళా సంఘాల సభ్యులు, యువత మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు