
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. పశ్చిమ గోదావరి జిల్లా: నరసాపురంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ యువతిని(31) మార్గాని రమేశ్ అనే వ్యక్తి అతి దారుణంగా హత్య చేశాడు. నరసాపురం రైల్వేస్టేషన్ నుంచి సఖినేటిపల్లికి కారులో వెళ్తున్న సమయంలో నిందితుడు హత్యకు పాల్పడ్డాడు. అత్యంత దారుణంగా కత్తితో పలుమార్లు పొడిచి ప్రాణాలు తీశాడు. అడ్డుకోబోయిన కారు డ్రైవర్ సురేశ్‌పైనా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. డ్రైవర్ సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. యువతి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు గాయపడిన సురేశ్‌కి చికిత్స అందిస్తున్నారు. ఈ హత్య ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో హతురాలు, నిందితుడిది కోనసీమ జిల్లా సఖినేటిపల్లిగా గుర్తించారు. మరోవైపు హత్యకు గల కారణాలపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఏ విషయంలో వారికి గొడవ వచ్చింది?, ప్రేమ, నగదు లావాదేవీలు ఏమైనా ఉన్నాయా? అనే అంశాలనూ పరిశీలిస్తున్నారు. ప్రధాని మోదీ చొరవతో యోగాకు అంతర్జాతీయ గుర్తింపు: మంత్రి నారాయణ సాయికృష్ణ అదృశ్యంపై ప్రభుత్వం మరో కీలక నిర్ణయం