
Ind Vs Pak : క్రికెట్ ప్రపంచంలో అత్యంత ఉత్కంఠభరితంగా సాగే భారత్, పాకిస్థాన్ మహాసంగ్రామానికి మళ్లీ సమయం ఆసన్నమైంది. మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా ఆదివారం సాయంత్రం హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా, సాంప్రదాయ ప్రత్యర్థి అయిన పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో భారత మహిళల జట్టుకు ఇదే మొదటి మ్యాచ్ కావడం విశేషం. సాధారణంగానే భారత్-పాక్ మ్యాచ్ అంటే మైదానంలో ఆటే కాదు, మైదానం వెలుపల కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, వివాదాలు తెరపైకి వస్తుంటాయి. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు మీడియా వేదికగా ఒక పాత వివాదం మళ్లీ చర్చనీయాంశంగా మారింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు, ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు పరస్పరం షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే, గత ఏడాది జరిగిన ఆసియా కప్ నుంచి భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల కారణంగా పురుషుల, మహిళల జట్లు పాక్ ఆటగాళ్లతో చేతులు కలపడం లేదు. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమిండియా తీసుకున్న ఈ నిర్ణయాన్ని అండర్-19 వరల్డ్ కప్, రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌లలో కూడా భారత ఆటగాళ్లు కొనసాగించారు. ఇప్పుడు మహిళల టీ20 ప్రపంచకప్‌లో కూడా ఇదే పంథా కొనసాగుతుందా అనే ప్రశ్న తలెత్తింది. వివాదాలపై హర్మన్‌ప్రీత్ కౌర్ గట్టి కౌంటర్ పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో విలేఖరులు ఈ షేక్‌హ్యాండ్ వివాదం గురించి, అలాగే దీనిపై బీసీసీఐ నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా అని హర్మన్‌ప్రీత్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నపై భారత కెప్టెన్ చాలా చాకచక్యంగా, గట్టిగా స్పందించారు. “మేము ఇక్కడికి వచ్చింది కేవలం క్రికెట్ ఆడటానికి మాత్రమే. మేము ఎప్పుడూ క్రికెట్ గురించే మాట్లాడతాం, క్రికెట్ గురించే ఆలోచిస్తాం. అంతకు మించి వేరే ఏ విషయాలనూ నేను పట్టించుకోను. చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడటమే మా కల, రేపటి మ్యాచ్‌ను