
Bandi Sai Bhageerath | హైదరాబాద్ : ఇటీవల మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు, పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌ను 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అనంతరం బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసులో తాజాగా బండి సాయి భగీరథ్‌కు బెయిల్ మంజూరైంది. బండి భగీరథ్ వేసిన బెయిల్ పిటిషన్‌ను ప్రభుత్వ తరపు లాయర్లు వ్యతిరేకించపోవడంతో మల్కాజ్‌గిరి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా బండి సాయి భగీరథ్ కేసులో బాధితులను వేధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, సంగప్పల పేర్లను పోలీసులు ఇప్పటివరకు A2, A3లుగా చేర్చకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసుపై ఇంత వరకు చార్జ్ షీట్ వేయకపోవడం.. కేసు వివరాలు, పురోగతి గురించి ఇప్పటిదాకా బాధిత కుటుంబానికి పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు వివరించకపోవడం అనేక ప్రశ్నలను లేవనెత్తుత్తోంది. పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నిందితుడికి మద్దతుగా నిలుస్తూ బాధితురాలికి, ఆమె తల్లికి ఏ మాత్రం సహకరించలేదని తాజా పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయి. పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్‌కు బెయిల్ మంజూరు బండి భగీరథ్ వేసిన బెయిల్ పిటిషన్‌ను వ్యతిరేకించని ప్రభుత్వ తరపు లాయర్లు దీంతో బెయిల్ మంజూరు చేసిన మల్కాజ్‌గిరి కోర్టు — Telugu Scribe (@TeluguScribe) June 20, 2026 NEET-UG Admit Card: నాగపూర్ అభ్యర్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ .. నీట్ అడ్మిట్ కార్డు వివాదం ప్రియుడితో ఏకాంతంగా ఉన్నప్పుడు ఏడుస్తున్నాడని.. రెండేళ్ల కొడుకును చంపేసిన తల్లి OTT Releases | ‘దృశ్యం 3’, ‘మారీచిక’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్‌లివే!