పాకాల పిలుస్తోంది
Actor ProfilePolitician

పాకాల పిలుస్తోంది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
పాకాల పిలుస్తోంది
Andhra Jyothy11 Jul 2026
పాకాల పిలుస్తోంది

ఆధునిక హంగులతో కొత్త రూపు సంతరించుకున్న టూరిజం స్పాట్‌ పిల్లలు, పెద్దలు ఉల్లాసంగా గడిపేలా ఏర్పాట్లు ఆకట్టుకుంటున్న బయోడైవర్సిటీ పార్కు సరస్సులో హాయి హాయిగా బోటు షికారు ప్రకృతిలో సేదతీరేందుకు నైట్‌ క్యాంపింగ్‌ ఉత్తేజభరితం ట్రెక్కింగ్‌, నేచర్‌వాక్‌ పార్టీలు, ఫంక్షన్లకు ప్రత్యేక ప్యాకేజీలు ఖానాపురం(వరంగల్): ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే సుందరమైన పర్యాటక ప్రదేశం పాకాల. సహజ సిద్ధ అందాలకు ఇప్పుడు ఆధునిక హంగులు కల్పించడంతో మరింత శోభను సంతరించుకుంది. నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వారు చూడాల్సిన ప్రదేశాలు.. ఎక్కడ బస చేయాలి.. ఇలా పాకాల ఎంట్రీ నుంచి ఎగ్జిట్‌ వరకు ఎక్కడ ఏ చార్జీలు చెల్లించాలో పూర్తి సమాచారం పర్యాటకుల కోసం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి 205 కి.మీ. దూరంలో పాకాల సరస్సు ఉంటుంది. హైదరాబాద్‌ నుంచి రైళ్లలో వచ్చే పర్యాటకులు వరంగల్‌లో దిగి అక్కడి నుంచి బస్సు మార్గంలో రావాలి. వరంగల్‌కు 58 కి.మీ. దూరంలో పాకాల ఉంటుంది. అయితే ఎక్కువశాతం ప్రైవేట్‌ వాహనాల్లో వస్తుంటారు. పాకాల బయోడైవర్సిటీ పార్కు ఎంట్రీ గేటు నుంచి కట్టపైకి వెళ్లాలి. ఎంట్రీ ఫీజు పెద్దలకు ఒక్కొక్కరికి రు.50, చిన్నారులకు రు.30 చెల్లించాలి. ప్లాస్టిక్‌ వస్తువులను లోనికి తీసుకెళ్లరాదు. అదేవిధంగా పాకాల కట్టపైకి ప్రైవేట్‌ వాహనాలకు అనుమతి లేదు. కట్టపైకి వెళ్లేందుకు బ్యాటరీ వాహనాలు ఉంటాయి. ఒక్కో పర్యాటకుడు రు.10 చెల్లించి అందులోనే వెళ్లాలి. ఆటో ఎంగేజ్‌ తీసుకుంటే అరగంటకు రు.400 చెల్లించాల్సి ఉంటుంది. సరస్సులో బోటు షికారు ఉంటుంది. రెండు రకాల బోట్లు ఏర్పాటు చేశారు. స్పీడ్‌ బోటులో ప్రయాణానికి రు.400, పెద్ద బోటులోనైతే రు.50 చెల్లించాల్సి ఉంటుంది. పాకాల కట్ట దిగువన చిల్డ్రన్స్‌ పార్క్‌ ఏర్పాటు చేశారు. అక్కడ చిన్నారులు ఆడుకోవడానికి ప్రాంఫోలిన్‌, జంపింగ్‌, రోప్‌ టైర్స్‌, టైర్‌ నెట్‌ వంటి వివిధ రకాల ఆట వస్తువులను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కరికి రు.50 చెల్లించి