
దక్షిణాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పీక్స్‌కు చేరాయి. సరిహద్దు దేశాలపై తన వంకర బుద్ధిని ప్రదర్శిస్తూ ఆఫ్ఘనిస్తాన్ భూభాగంపై పాకిస్తాన్ సైన్యం జరిపిన భయానక వైమానిక దాడులను భారత్ తీవ్రస్థాయిలో ఖండించింది. పాక్ చేసిన ఈ పనిని అత్యంత ఘోరమైన బరితెగింపు, ప్రత్యక్ష దురాక్రమణ (Blatant act of aggression) గా భారత్ అభివర్ణించింది. ఈ బాధ్యతారాహిత్య ప్రవర్తన ప్రాంతీయ శాంతికి, సుస్థిరతకు తీవ్ర ముప్పని భారత విదేశాంగ శాఖ (MEA) అత్యంత ఘాటుగా హెచ్చరించింది. సొంత దేశంలో ఎదురవుతున్న అంతర్గత వైఫల్యాలను, వైరుధ్యాలను కప్పిపుచ్చుకోవడానికే పాక్ పక్క దేశాలపై ఇలాంటి క్రూరమైన హింసకు తెగబడుతోందని భారత్ ప్రపంచం ముందు ఇస్లామాబాద్‌ను ఏకిపారేసింది.నైతికత లేని డబుల్ టాప్ దాడి!ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు ప్రావిన్సులైన పక్తియా, పక్తికా, కునార్ లపై పాక్ వైమానిక దళం అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా విరుచుకుపడింది. ఇళ్లలో ప్రశాంతంగా నిద్రిస్తున్న పౌరులపై బాంబుల వర్షం కురిపించింది. తాలిబన్ ప్రభుత్వం వెల్లడించిన అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఘోర దాడుల్లో మహిళలు, పిల్లలతో సహా 36 మంది అమాయక పౌరులు సజీవ దహనమవగా, మరో 163 మంది తీవ్రంగా గాయపడ్డారు.అంతేకాదు, ఇక్కడ పాక్ సైన్యం అత్యంత రాక్షసత్వానికి ఒడిగట్టింది. పక్తియా ప్రాంతంలో మొదటిసారి బాంబు దాడి జరిగిన వెంటనే.. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడటానికి స్థానిక పౌరులు, పొరుగువారు అక్కడికి పరుగున వచ్చారు. ఆ సమయంలో పాక్ ఆర్మీ ఏమాత్రం మానవత్వం లేకుండా.. రక్షించడానికి వచ్చిన వారిని లక్ష్యంగా చేసుకుని రెండోసారి కూడా బాంబు దాడి (Double-Tap Attack) కి తెగబడింది. ఈ నైతికత లేని దాడిలోనే అత్యధికంగా 28 మంది గ్రామీణులు ప్రాణాలు కోల్పోయినట్లు ఆఫ్ఘాన్ ప్రతినిధి హమ్దుల్లా ఫిత్రత్ కన్నీటి పర్యంతమయ్యారు.ఉగ్రవాదుల ఏరివేత పేరిట పాక్ మైండ్ గేమ్!అయితే, తాము పౌరులను చంపలేదని, కరాచీలో పారామిలిటరీ దళాలపై జరిగిన దాడికి సూత్రధారులైన జమాత్-ఉల్-అహ్రార్ ఉగ్రవాద స్థావరాలనే మట్టుబెట్టామని పాక్ సమర్థించుకునే ప్రయత్నం