
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఒక అరుదైన రికార్డు సాధించింది. భారత్ తరఫున టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా హర్మన్ నిలిచింది. మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ తరఫున ఇప్పటివరకు ఈ రికార్డు మిథాలీరాజ్ పేరిట ఉంది. మిథాలీరాజ్ 40.33 సగటుతో 726 పరుగులు సాధించింది. తాజాగా హర్మన్‌ప్రీత్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బౌండరీ కొట్టడం ద్వారా మిథాలీరాజ్ రికార్డును బద్దలుకొట్టి అగ్రస్థానంలో నిలిచింది. ఇక హర్మన్, మిథాలీ రాజ్ తర్వాత స్మృతి మంధాన 524 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, జెమీమా రోడ్రిగ్స్ 407 పరుగులతో నాలుగో స్థానంలో, పూనమ్ రౌత్ 375 పరుగులతో ఐదో స్థానంలో కొనసాగుతున్నారు. మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లు ముగిసేసరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. హర్మన్‌ప్రీత్ (36), రిచా ఘోష్ (7) పరుగులతో ఆడుతున్నారు. అంతకముందు ఓపెనర్ స్మృతి మంధాన 68 పరుగులు చేసింది. చదవండి: బాస్కెట్‌బాల్ చరిత్రలో సంచలనం.. 53 ఏళ్ల నిరీక్షణకు తెర! సొంతూరిలో విజయ్-రష్మిక.. ఓ మంచి కార్యక్రమం (ఫొటోలు) యూరప్ ట్రిప్‌లో హీరోయిన్ కల్యాణి (ఫొటోలు) ఇందిరా పార్క్ ధర్నా చౌక్‌లో కాక్రోచ్ పార్టీ ధర్నా.. జెన్‌జీ భారీ మద్దతు (ఫొటోలు) కుమార్తె గ్రాడ్యుయేషన్ డేలో హీరోయిన్ లయ (ఫొటోలు) Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జూన్ 14- 21) నందూస్ వరల్డ్ కేసులో అదిరిపోయే ట్విస్ట్.. మోసం వెనుక అసలు కారణం..? కడప కార్పొరేషన్ వద్ద సచివాలయ ఉద్యోగుల ఆందోళన బ్యాగ్ తో టిప్ టాప్ గా ఫ్లైట్ దిగింది.. అడ్డంగా బుక్కైంది.. జ్ఞానేశ్వరి కేసులో కీలక మలుపు... కుక్క చావులో అనుమానం